maheshbabu movie satrugna sinha in negative role

Maheshbabu movie satrugna sinha in negative role

maheshbabu , maheshbabu new movie, mahesh upcoming movie, mahesh next movies, mahesh and murugadas movie, murugadas movie , satrugna sinha villian

maheshbabu and murugadas combination new movie bollywood star satrugna sinha playing a negative role in this movie.

మళ్లీ భారీ తారాగణం...!

Posted: 06/28/2016 03:49 PM IST
Maheshbabu movie satrugna sinha in negative role

మహేష్ బాబు మరుగదాస్ ల క్రేజీ కాంబినేషన్ త్వరలోనే ప్రారంభమవబోతోంది. ఈ సినిమాకి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసిన డైరెక్టర్ మురుగదాస్ భారీ తారాగణాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పరిణీతి చోప్రాని బాలీవుడ్ నుంచి ఎంచుకున్న సంగతి తెలసిందే. ఇప్పుడు ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో శత్రుఘ్న సిన్హా మళ్లీ తెలుగులో కనిపించబోతున్నాడు. నిజానికి బాలీవుడ్ ని కొన్న దశాబ్దాల పాటు ఏలిన ఈ సూపర్ స్టార్ తెలుగులో మాత్రం ఎక్కువ సినిమాలు చేయలేకపోయాడు. కేవలం రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమాలో మాత్రమే కనిపించాడు. అయితే ఇప్పుడు ఒక నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఈ బాలీవుడ్ స్టార్ కనిపించబోతున్నాడట.

ఇక మహేష్ బాబు లేకుండానే ముహూర్తం షాట్ తీసేందుకు మురుగదాస్ అన్ని ఆయుధాలను సిద్ధం చేసుకున్నాడు. సినిమాని జూలైలో లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. మహేష్ బాబు ముహూర్తం షాట్ కి లేకపోతే ఆ సినిమా సెంటిమెంట్ గా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా, సినిమాలో మహేష్ కొత్త లుక్ తో కనిపించబోతున్నాడట. దీనికోసం గెడ్డం పెంచి ఒక స్టైలిష్ లుక్ తో దర్శనమివ్వనున్నాడని అందుకే ముహుర్తం షాట్ లో కనిపించడం లేదని కూడ టాక్ వినబడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maheshbabu  prince mahesh  murugadas  murugadas new movie  mahesh babu upcomin movie  

Other Articles