kabali movie story leaked

Kabali movie story leaked

kabali movie news, kabali story, kabali movie rajini, kabali director, kabali gossips, kabali don, kabali rajini look, kabali new teaser, kabali trailer, kabali audio, kabali scenes, kabali full movie online, kabali movie tickets

rajinikanth hero kabali movie story was leaked by the director ranjith in press meet. he opened story line for fans in the occation of telugu audio launch

'కబాలి' కథ లీకైంది...!

Posted: 06/28/2016 12:38 PM IST
Kabali movie story leaked

సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘కబాలి’ సినిమా స్టోరికి సంబంధించి డైరెక్టర్ పా.రంజిత్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ఈ మూవీ తెలుగు ఆడియో విడుదల వేడుకల సందర్భంగా హైదరాబాద్‌కి వచ్చిన రంజిత్  మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా స్టోరీతోపాటు మరెన్నో విషయాలను పంచుకున్నాడు.

కబాలి కథేంటంటే, భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటీష్ వాళ్ళు తమిళియన్స్ ని మలేషియాకి తీసుకెళ్తారు. అక్కడ రబ్బర్ ఫ్యాక్టరీల్లో లేబర్స్‌గా పనిలో పెడతారు. వాళ్ళందరినీ ఆంగ్లేయులు బానిసలుగా చూస్తుంటారు. వారికున్న సమస్యలను ఎదిరించడానికి కబలీశ్వరన్ అనే ఓ వ్యక్తి ‘కబాలి’ గా మారుతాడు అతనే రజనీకాంత్. వారిని ఎదిరించి అందరికీ అండగా నిలుస్తాడు. ? ఆ తర్వాత ఏం జరుగుతుందన్న నేపథ్యంలో కథ సాగుతుందని రంజిత్ పేర్కొన్నాడు. అయితే యంగ్ గా ఉన్న రజనీకాంత్ పాత్రే సినిమాలో ఎక్కువగా కనిపిస్తుందని, ఈ సినిమాలో రజినీకాంత్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఓల్డ్ లుక్‌లో కనిపిస్తారని చెప్తున్నాడు డైరెక్టర్.  

రజినీని యంగ్‌గా చూపించడానికి 1980లలో ఆయన నటించిన సినిమాల్లోని ఫోటోలనే రిఫరెన్స్‌గా తీసుకున్నానన్నాడు. ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్, డ్రామా, తదితర ఎల్లిమెంట్లన్నీ ఉంటాయని,  ఇందులో రజనీ నటన చాలా టెర్రిఫిక్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles