తెలంగాణ యాసపై కోపం లేదు కానీ... | Tanikella Bharani on telangana slang

Tanikella bharani on telangana slang

Senior actor Tanikella Bharani comments on telanagana slang, Tanikella Bharani about telangana slang, telugu directors donot know how to use telangana slang, తెలంగాణ యాసపై తనికెళ్ల భరణి కామెంట్స్, తెలంగాణ యాసపై భరణి, వాడకం తెలీకనే తెలంగాణ యాసను గెలిచేస్తున్నారు, తెలుగుసినిమాల్లో తెలంగాణ యాస, latest news, film news, telugu movie news, latest news, telugu news

Senior actor Tanikella Bharani respond on telangana slang used in telugu movies. Directors Do not know how to pronounce telangana slang and used it for comedy.

తెలంగాణ యాసపై కోపం లేదు కానీ...

Posted: 06/20/2016 12:48 PM IST
Tanikella bharani on telangana slang

యాదగిరి, భువనగిరి అంటూ పేర్లు పెడుతూ కమెడియన్లకు, విలన్లకు తమ యాసను అంటగట్టి గేలి చేస్తున్నారని గతంలో తెలంగాణ వాదులు లొల్లి చేయడం మనం చూశాం. అయితే అది అప్పుడప్పుడే వచ్చిన చిత్రాల్లో చేసిందేం కాదు. 80వ దశకం నుంచి వస్తున్న చిత్రాల్లో కూడా నైజాం భాషను తెలుగు చిత్రాల్లో విరివిరిగా వినియోగించేవారు. కానీ, విమర్శలు ఎఫెక్ట్ తోనో మరేయితరర కారణాలతోనో ఇప్పుడు హీరోలకు, హీరోయిన్లకు తెలంగాణ యాసను వాడేస్తున్నారు.

అయితే అసలు సినిమాల్లో తెలంగాణ భాషను వాడాల్సిన అవసరం ఏముందనేది మరో వర్గం వాదన. దీనిపై తెలంగాణ భాషతో పాపులర్ అయిన సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి స్పందించారు. తెలంగాణ యాసను ఎలా పలకాలో తెలియకనే సినిమాల్లో వ్యంగ్యంగా వాడుతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. ‘‘సినీ పరిశ్రమలోని ఏ వ్యక్తికీ తెలంగాణ భాషపై కోపంగానీ, దాన్ని అవమానించాలన్న ఉద్దేశం కానీ ఎవరికీ లేదు. అసలు ఉచ్ఛరించే విధానం తెలీకనే కామెడీ కోసం ఆ భాషను వాడేసుకుంటున్నారని’’ ఆయన అన్నారు. ఖమ్మంలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శంకరునితో సాధారణ వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుందో తెలియజెప్పాలనే తెలంగాణ భాషను మేళవించి ‘శభాష్ రా శంకర’ అనే గేయాన్ని రచించినట్లు తెలిపారు. అంతేకాదు ఓ హీరోయిన్ ను పూర్తి స్థాయి తెలంగాణలో మాట్లాడించాలన్న ఉద్దేశంతోనే విజయశాంతితో మొండిమొగుడు-పెంకి పెళ్లాం చిత్రాన్ని తీసినట్లు ఆయన చెప్పారు. ప్రాంతాలు, యాసలు వేరైనా తెలుగు భాష ఒక్కటేనని ఆయన చెప్పుకోచ్చారు. ఎస్వీఆర్, సావిత్రి లాంటి వాళ్లకు ప్రభుత్వాలు పురస్కారాలు ఇవ్వకపోవటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా భవిష్యత్తలో ఎలాంటి పురస్కారాలను తాను స్వీకరించబోనని ఆయన తేల్చి చెప్పారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tanikella Bharani  actor Tanikella Bharani  telangana slang  telugu movies  

Other Articles