hero nithin and crazy director vikram combination again coming in tollywood.

Hero nithin and crazy director vikram combination again coming in tollywood

hero nithin, nithin hero , nithin upcoming movies, vikram next movie, vikram director, director vikram next movies, 24 director vikram, vikram combinations nithin and nithya menon

hero ninthin and director vikram combination movie coming again. the precious movie ishq was super hit for these combination. now vikram prepairing two subjects for beg heros. before that he is planing to do this movie

మళ్లీ కలిసి ఇష్క్ చేద్దామా...?

Posted: 06/20/2016 12:35 PM IST
Hero nithin and crazy director vikram combination again coming in tollywood

నితిన్‌ సినీ ప్రయాణానికి కీలక మలుపు నిచ్చిన చిత్రం 'ఇష్క్‌'. నితిన్‌ వరుస పరాజయాలకు అడ్డుకట్ట వేసి విజయం తలుపు తెరిచేలా చేసిందీ చిత్రం. ఈ చిత్రంతో నితిన్‌ ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఆ సినిమాతో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వ ప్రతిభ తెలుగు ప్రేక్షకులకు అర్థమైంది. ఇప్పుడు నితిన్‌ మరోసారి విక్రమ్‌తో ఓ సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.

వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపుదిద్దుకొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది. విక్రమ్‌ '24' సినిమా తర్వాత మరో సినిమా పట్టాలెక్కించలేదు. ఇద్దరు అగ్ర కథానాయకుల కోసం ఆయన కథలు సిద్ధం చేసుకొంటున్నారు. అల్లు అర్జున్, మహేష్ బాబు లతో సినిమాలు తీసేందుకు స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈలోపే వాళ్ల డేట్స్ కుదరకపోతే నితిన్ తో సినిమా చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా 'ఇష్క్‌' లానే ప్రేమకథ గా ఉంటుందని త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు అందరూ.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithin  director vikram k kumar  hero nithin  nithin ishq movie  

Other Articles