రికార్డుల మోతలో కబాలి నెరుప్పు దా | Kabali Neruppu Da Song Teaser

Kabali neruppu da song teaser

Kabali Neruppu Da Song Teaser, Kabali Audio Track List, Kabali Audio Date, Kabali Movie Posters, Kabali Trailers, Kabali stills, Kabali diolagues, Kabali movie updates, Kabali movie news, Rajinikanth stills, Rajinikanth movies, Rajinikanth

Kabali Neruppu Da Song Teaser: Kabali is an upcoming 2016 Indian Tamil-language film written and directed by Pa Ranjith. The film stars Rajinikanth, Radhika Apte and Dinesh. Music composed by Santhosh Narayanan. Think Music has acquired the audio rights for all three languages – Tamil, Telugu and Hindi. Kabali Songs.

రికార్డుల మోతలో కబాలి నెరుప్పు దా

Posted: 06/17/2016 09:59 AM IST
Kabali neruppu da song teaser

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కబాలి’ సినిమాలోని ‘నెరుప్పు దా..’ సాంగ్ టీజర్ నిన్న సాయంత్ర విడుదల చేసారు. రజనీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ కు అభిమానులున్నారు. ఇప్పటికే విడుదలైన ‘కబాలి’ టీజర్ ప్రపంచ వ్యాప్తంగా కొత్త రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన సాంగ్ టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.

24గంటలు గడవకముందే ఈ సాంగ్ టీజర్ 1,178,545 మంది వీక్షించారు. ఇందులో రజనీకాంత్ చాలా స్టైలిష్ గ్యాంగ్ స్టర్ లుక్ లో కనిపిస్తున్నాడు. అంతేకాకుండా గడ్డం లేకుండా కూడా బాగున్నాడు. ఈ సినిమాను పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరించినట్లుగా కనిపిస్తుంది. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మాత కలైపులి.ఎస్.థాను నిర్మిస్తున్నారు. రాధిక ఆప్టే, ధన్సిక ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాను అతి త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  Rajinikanth  Radhika apte  

Other Articles

Today on Telugu Wishesh