koratala siva birthday parthy in janatha garage sets

Koratala siva birthday parthy in janatha garage sets

janatha garage, janatha garage koratala siva, koratala siva, janatha garrage, janatha next , koratala siva next

director koratala siva birthday celebrations in janatha garage sets. this is koratala siva's third film. he is trying hatrick hits and also jr ntr waiting for big mass hit.

జనతాగ్యారేజ్ లో పుట్టినరోజు సందడి...!

Posted: 06/15/2016 01:31 PM IST
Koratala siva birthday parthy in janatha garage sets

ఒకదాన్ని మించి మరొకటి రెండు వరుస హిట్లివ్వడంతో తెలుగు చిత్రసీమలోని అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు కొరటాల శివ. రచయిత నుంచి దర్శకుడిగా మారి, ప్రభాస్‌తో రూపొందించిన తొలి సినిమా ‘మిర్చి’తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న కొరటాల ఆ తర్వాత మహేశ్‌ను ‘శ్రీమంతుడు’గా తీర్చిదిద్ది మరింత ఘన విజయాన్ని అందుకున్నారు.

‘బాహుబలి’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా శ్రీమంతుడు రికార్డులకెక్కడంతో శివ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో మాస్ యాక్షన్ మూవీ అంటూ జనతాగ్యారేజ్ లో సందడి చేస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగష్ట్ లో రానున్న ఈ సినిమాతో శివ హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్ ఎవరని అడిగితే ఖచ్చితంగా శివ పేరు ముందుటుంది. ఈరోజు కొరటాల శివ పుట్టినరోజు సందర్భంగా జనతాగ్యారేజ్ షూటింగ్ లో పండగ వాతావరణం నెలకొందంట. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ శివకి ప్రత్యేకించి అభినందనలు తెలుపుతున్నారు.

ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఎలాంటి సినిమాకి సైన్ చేస్తాడో అని ఫిలిం నగర్ వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janatha garage  koratala siva  samantha  jr ntr  

Other Articles