అమ్మగా జీవించేసిన యువ హీరోయిన్ | Amma Kanakku Official Trailer

Amma kanakku official trailer

Amma Kanakku Official Trailer, Amma Kanakku songs, Amma Kanakku jukebox, Amma Kanakku stills, Amma Kanakku posters, Amala Paul movies, Amala Paul stills

Amma Kanakku Official Trailer: Starring Amala Paul, Samuthirakani and Revathi. Music Composed by Ilaiyaraaja and Directed by Ashwiny Iyer Tiwari.

అమ్మగా జీవించేసిన యువ హీరోయిన్

Posted: 06/10/2016 03:27 PM IST
Amma kanakku official trailer

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో తెలుగు సినీ అభిమానులకు దగ్గరైన తమిళ హీరోయిన్ అమలాపాల్ నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘అమ్మా కనక్కు’. అమలాపాల్, సముద్రఖని, రేవతి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు.

ఇందులో అమలాపాల్ చాలా చక్కగా నటించింది. కేవలం ట్రైలర్ చూస్తుంటేనే ఇంప్రెసివ్ గా వుంది. తన పాత్రలో జీవించేసిందని చెప్పుకోవచ్చు. అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు మెస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. పాటలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.

వండర్ బార్ స్టూడియోస్ మరియు కలర్ యెల్లో బ్యానర్లపై నిర్మాత ధనుష్, ఆనంద్ ఎల్.రాయ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul  Amma Kanakku  Dhanush  

Other Articles

Today on Telugu Wishesh