రాబిన్ హుడ్ ఎంట్రీకి సర్వం సిద్ధం | Ravi teja Robin hood latest updates

Ravi teja robin hood latest updates

Ravi Teja Robin hood latest updates, Ravi Teja movies, Ravi Teja as Robin Hood, Ravi Teja Robin hood movie details, Ravi Teja latest stills, Ravi Teja movies, Ravi Teja upcoming films, Ravi Teja

Ravi teja Robin hood latest updates: After Bengal Tiger.. Mass Maharaj Ravi Teja upcoming film title Robin hood. DVV Danayya producer. Chakri director. Raashi khanna heroine.

రాబిన్ హుడ్ ఎంట్రీకి సర్వం సిద్ధం

Posted: 06/10/2016 10:47 AM IST
Ravi teja robin hood latest updates

‘బెంగాల్ టైగర్’ విడుదలై చాలా కాలం అవుతున్న మాస్ మహారాజ్ రవితేజ తన కొత్త సినిమాను ఇంకా ప్రారంభించలేదు. దిల్ రాజు - రవితేజల కాంబినేషన్లో ‘ఎవడో ఒకడు’ పేరుతో ఓ సినిమా రూపొందనుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకముందే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత ‘రాబిన్ హుడ్’ పేరుతో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలొచ్చాయి. కానీ ఆ సినిమా కూడా సెట్స్ పైకి ఇంకా వెళ్లలేదు.

అయితే ‘బెంగాల్ టైగర్’ తర్వాత తాను చేయబోయే సినిమా ‘రాబిన్ హుడ్’ అని ఇటీవలే రవితేజ ఓ కార్యక్రమంలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని తెలిసింది. ఈ సినిమాతో చక్రి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. రవితేజతో మరోసారి రాశిఖన్నా రొమాన్స్ చేయనుంది. కమర్షియల్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.

తాజా సమాచారం ఈ సినిమాను జులై నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని తెలిసింది. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Robin hood  Raashi khanna  

Other Articles

Today on Telugu Wishesh