బన్నీ సుల్తాన్.. స్నేహా సుల్తానా | Allu Arjun as Sultan

Allu arjun as sultan

Allu Arjun as Sultan, Sneha reddy in sultana, Allu Arjun movies, Allu Arjun movie updates, Sarrainodu collections, Allu Arjun film updates, Allu Arjun stills

Allu Arjun as Sultan: Stylish star allu arjun new look in his holiday trip. Allu arjun as Sultan and his wife Sneha reddy as Sultana.

బన్నీ సుల్తాన్.. స్నేహా సుల్తానా

Posted: 06/10/2016 09:50 AM IST
Allu arjun as sultan

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సరైనోడు’. 50రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవలే మలయాళంలో ‘యోధవు’ పేరుతో విడుదలై, అక్కడ కూడా ఘనవిజయం సాధించింది. తెలుగు, మలయాళం భాషలలో బన్నీ కలెక్షన్ల మోత మోగిస్తున్నాడు. ఇదిలా వుంటే బన్నీ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు.

అక్కడ సుల్తాన్ గెటప్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇస్తాంబుల్ లో సుల్తాన్ వేషంలో బన్నీ, సుల్తానా వేషాధరణలో బన్నీ భార్య స్నేహరెడ్డిలు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. స్నేహరెడ్డి కూడా హీరోయిన్ తరహాలోనే చాలా అందంగా వుందని, సినిమాల్లో కూడా నటిస్తే బాగుంటుందని బన్నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇక ‘సరైనోడు’ తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. తమిళ దర్శకుడు లింగుస్వామి మరియు విక్రమ్.కె.కుమార్ లు బన్నీతో సినిమా చేయడానికి సిద్ధంగా వున్నారు. బన్నీ హాలీడే ట్రిప్ ముగించుకొని వచ్చిన అనంతరం ఏదో ఒక ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేయనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu arjun  Sneha reddy  Sarrainodu  

Other Articles