మహేష్ తో జోడికట్టనున్న పరిణితి చోప్రా | Mahesh Babu heroine confirmed

Mahesh babu heroine confirmed

Mahesh Babu heroine confirmed, Mahesh Babu with Parineeti, Mahesh Babu movie updates, Mahesh Babu movies, Mahesh Babu, Parineeti Chopra, Parineeti Chopra movies, Parineeti Chopra hot stills, Parineeti Chopra stills

Mahesh Babu heroine confirmed: Super star Mahesh Babu upcoming film Director AR murugados. Parineeti Chopra heroine.

మహేష్ తో జోడికట్టనున్న పరిణితి చోప్రా

Posted: 06/09/2016 01:04 PM IST
Mahesh babu heroine confirmed

మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా ఇప్పటివరకు చాలా మందిని అనుకున్నప్పటికీ.. చివరకు బాలీవుడ్ యువ హీరోయిన్ పరిణితి చోప్రాను ఖరారు చేసినట్లుగా తెలిసింది. మహేష్ కూడా కొత్త హీరోయిన్ అయితేనే పెయిర్ బాగుంటుందనే ఉద్దేశ్యంతో వుండటంతో దర్శకుడు పరిణితి చోప్రాను ఖరారు చేసినట్లుగా తెలిసింది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్ తో ‘నాని’ చిత్రాన్ని తెరకెక్కించన దర్శకుడు ఎస్.జే.సూర్య.. ఈ సినిమాలో మహేష్ కు విలన్ గా నటిస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ సినిమాటోగ్రఫిని, హారీస్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Video Source: SriBalajiMovies

ఇప్పటికే ఓ మూడు పాటలను హారీస్ జయరాజ్ కంపోజ్ చేసాడని, ఇందులోని ఇంట్రడక్షన్ సాంగ్ తో షూటింగ్ ప్రారంభించబోతున్నారని సినీవర్గాల సమాచారం. ఇక ఈ సినిమా కోసం మహేష్ చాలా కేర్ తీసుకుంటున్నాడని సమాచారం. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Parineeti Chopra  AR Murugados  

Other Articles

Today on Telugu Wishesh