అందాల మాధురి కల నెరవేరిందోచ్! | Madhuri Dixit Fulfill her dream

Madhuri dixit fulfill her dream

Madhuri Dixit Fulfill her dream, Madhuri Dixit Turns Choreographer, Madhuri Dixit latest stills, Madhuri Dixit hot stills, Madhuri Dixit news, Madhuri Dixit shows

Madhuri Dixit Fulfill her dream: Bollywood Actress Madhuri Dixit says she always wanted to be a choreographer. And she got a chance to fulfill her dream via TV show.

అందాల మాధురి కల నెరవేరిందోచ్!

Posted: 06/07/2016 05:05 PM IST
Madhuri dixit fulfill her dream

బాలీవుడ్ లోకి ఎంతమంది హీరోయిన్లు వచ్చినా కూడా మాధురి దీక్షిత్ స్థానం మాత్రం ఎవరూ కైవసం చేసుకోలేరు. బాలీవుడ్ లో మాధురి డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. డాన్సుల్లో గ్రేస్, హవభావాలు అన్ని కూడా చాలా చక్కగా ప్రదర్శించగల డాన్సింగ్ డైనమేట్ మాధురి. అలాంటి మాధురికి ఇప్పటికీ నెరవేరని ఓ కోరిక వుందట. ఇంతకీ ఆ కోరిక ఏంటో చూద్దామా!

ఇప్పటివరకు తన డాన్సులతో అలరించిన ఈ అమ్మడికి కొరియోగ్రాఫర్ అవ్వాలనే కోరిక వుందట. ఇప్పటివరకు ఆ కోరిక అలాగే వుండిపోయింది. కానీ తాజాగా ఓ టీవి షో ద్వారా ఆ కల నేరవేరిందని మాధురి చెప్పుకొచ్చింది. కొరియోగ్రాఫర్ అవ్వాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను.. ఆ కల ఇప్పటికీ ఈ టీవి షో ద్వారా నెరవేరింది. బొస్కో మార్టిన్, రణదీప్ హుడా, టెరెన్స్ లూయిస్, కాజల్ అగర్వాల్ తో డాన్స్ చేయిస్తానంటూ మాధురి చెప్పుకొచ్చింది.

మాధురి ఓ టివి ఛానెల్ లోని ‘సో యు థింక్ యు కెన్ డాన్స్ అబ్’ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. ఈ కార్యక్రమంలో మాధురి తన కలను నేరవేర్చుకుంది. మరి ఇందులో మాధురి ఎలాంటి స్టెప్పులు వేయించిందో, ఎలా అలరించిందో త్వరలోనే తెలియనుంది. ఈ వీడియోను త్వరలోనే ప్రసారం చేయనున్నారు.

- Sandy

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhuri Dixit  Dance Shows  So You Think You Can Dance  

Other Articles