సుల్తాన్ సుందరి ఖేల్ ఖతమ్ | Sultan Shooting Completed

Sultan shooting completed

Sultan Shooting Completed, Sultan songs, Sultan trailers, Sultan movie posters, Sultan movie updates, Sultan stills, Salman khan movies, Anushka Sharma, Movie News, Film Updates, Hot Gossips, Stills

Sultan Shooting Completed: Salman Khan and Anushka Sharma's upcoming film Sultan is among the most-awaited movies this year.

సుల్తాన్ సుందరి ఖేల్ ఖతమ్

Posted: 06/07/2016 06:16 PM IST
Sultan shooting completed

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం సుల్తాన్. అలీ అబ్బార్ జబ్బా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సల్మాన్ కు జోడిగా అనుష్క శర్మ నటిస్తుంది. ఇందులో వీరిద్దరూ రెజర్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఈ విషయాన్ని అనుష్కశర్మ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ‘బేబీ కో బాస్ పసంద్..’ అనే పాట దుమ్మురేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. తన ప్రేమకోసం ఓ రెజ్లర్ చేసే పోరాటమే కథాంశంగా సుల్తాన్ సినిమా రూపొందుతోంది.

నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ తన యాక్టింగ్ తోనే కాకుండా యాక్షన్ సీన్లతో కూడా అదరగొట్టనున్నాడు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sultan  Salman Khan  Anushka Sharma  

Other Articles