‘బాబు బంగారం’ టీజర్ సిరిగిపోయింది.. ఎంటర్ టైన్మెంట్ పక్కా! | Babu Bangaram Teaser

Babu bangaram teaser

Babu Bangaram Teaser, Babu Bangaram movie stills, Babu Bangaram movie news, Babu Bangaram movie posters, Babu Bangaram movie updates, Venkatesh movies, Venkatesh stills, Nayanthara stills

Babu Bangaram Teaser: Watch Babu Bangaram teaser. Ft Venkatesh and Nayanthara in the lead roles. Film written and directed by Maruthi. Music composed by Ghibran, Cinematography Richard Prasad, Produced by S. Naga Vamshi under Sithara Entertainments banner

‘బాబు బంగారం’ టీజర్ సిరిగిపోయింది.. ఎంటర్ టైన్మెంట్ పక్కా!

Posted: 06/06/2016 09:56 AM IST
Babu bangaram teaser

‘గోపాల గోపాల’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బాబు బంగారం’. ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై ప్రముఖ నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్పణ‌లో, నిర్మాతలు సూర్యదేవ‌ర నాగవంశి, పి.డి.వి.ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇందులో వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్మీ’, ‘తులసి’ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను తాజాగా విడుదల చేసారు.

ఇందులో వెంకటేష్ లుక్స్ అదిరిపోయింది. చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. వెంకటేష్ బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది. నయనతార లుక్స్ పరంగా బాగుంది. మరోసారి వీరిద్దరి జోడి అదిరిపోనున్నట్లుగా తెలుస్తోంది. ఎసిపి కృష్ణ పాత్రలో వెంకటేష్ నటిస్తున్నాడు. ఎంటర్ టైనింగ్ పోలీస్ ఆఫీసర్ గా వెంకీ మరోసారి తన కామెడీతో అలరించనున్నాడు. ఈ టీజర్ సినిమాపై వున్న అంచనాలను మరింతగా పెంచేసింది. లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.

ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఓ పాట, ఓ ఫైట్ సీన్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ వుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Babu Bangaram  Nayanthara  

Other Articles