సుకుమార్ ‘దర్శకుడు’కు ముహూర్తం ఫిక్స్ | Sukumar Darshakudu Shooting Date

Sukumar darshakudu shooting date

Sukumar upcoming film updates, Sukumar film title Darshakudu, Sukumar Darshakudu movie updates, Sukumar movies, Sukumar stills, Sukumar

Sukumar Darshakudu Shooting Date: Director Sukumar upcoming film title confirmed. The title is Darshakudu.

సుకుమార్ ‘దర్శకుడు’కు ముహూర్తం ఫిక్స్

Posted: 06/04/2016 05:39 PM IST
Sukumar darshakudu shooting date

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమారి 21ఎఫ్ చిత్రంతో నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. కుమారి 21ఎఫ్‌తో తొలిప్రయత్నంలోనే నిర్మాతగా అందరి ప్రశంసలు అందుకున్న ఈ యువ దర్శకుడు.. నిర్మాతగా మరో విలక్షణమైన చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. దర్శకుడు టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి హర్ లవ్... హీజ్ ప్యాషన్ అనేది ఉపశీర్షిక.

ఈ చిత్రం ద్వారా అశోక్ అనే నూతన నటుడిని హీరోగా, హరిప్రసాద్ జక్కాను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్ సమర్పణలో బీఎన్‌సీఎస్‌పీ (bncsp) విజయ్‌కుమార్, ధామాస్ ఆదూరి, సత్తి నదీర్ రవిచంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంతకుముందు... ఆ తర్వాతఫేం ఇషా నాయికగా, రెండో నాయికగా పూజిత నటించనుంది.

ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ... ఇదొక విభిన్నమైన ప్రేమకథా చిత్రం. ఈ నెల 9 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. నేటి యువతరం మెచ్చే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం కథ, కథనాలు ఎంతో ఆసక్తికరంగా వుంటాయి అని తెలిపారు.

అశోక్, ఇషా, పూజిత, బ్రహ్మాజీ, ధన్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఫోటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: రామచంద్రాసింగ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా, లైన్ ప్రొడ్యూసర్: వీఈవీకేడీఎస్ ప్రసాద్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం హరిప్రసాద్ జక్కా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sukumar  Darshakudu  Movie News  

Other Articles