దుబాయ్ లో పూర్తి.. వైజాగ్ లో రొమాన్స్ స్టార్ట్ | Jakkana romance with Mannar Chopra

Jakkana romance with mannar chopra

Jakkana romance with Mannar Chopra, Jakkana movie news, Jakkana stills, Jakkana movie posters, Jakkana, Sunil movies, Sunil movie updates, Sunil stills, Mannar chopra

Jakkana romance with Mannar Chopra: Sunil upcoming film Jakkanna. Mannar chopra heroine. Vamsi Krishna Akella director.

దుబాయ్ లో పూర్తి.. వైజాగ్ లో రొమాన్స్ స్టార్ట్

Posted: 06/03/2016 05:13 PM IST
Jakkana romance with mannar chopra

గోల్డెన్‌స్టార్‌ సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ త‌రువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న చిత్రం ఇటీవలే దుబాయ్ లోని అంద‌మైన లోకేష‌న్స్ లో జానీ మాస్టర్ కొరియోగ్రాఫ‌ర్ గా సాంగ్ షూటింగ్ జ‌రుపుకుంది. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ వారంలో వైజాగ్ లో జ‌రిగే సాంగ్ చిత్రీక‌ర‌ణ తో షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌వుతుంది. రెండ‌వ వారంలో ఆడియో విడుద‌ల చేసి జులై లో చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడ‌దల చేయటానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ...... సునీల్ గారు నటించిన మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెర‌కెక్కిస్తున్న మా చిత్రం జ‌క్క‌న్న ఇటీవ‌లే దుబాయ్ లో సాంగ్ షూటింగ్ జ‌రుపుకుంది. ఈ వారంలోనే మ‌రో సాంగ్ చిత్రీక‌ర‌ణ చేస్తాము. దీంతో షూటంగ్ మెత్తం పూర్త‌వుతుంది. మాహీరో సునీల్ పెర్ ఫార్మెన్స్ లో అన్ని ర‌కాల షెడ్స్ వుంటాయి. సునీల్ గారి కామెడి టైమింగ్ కి డైర‌క్ట‌ర్ వంశి రాసిన సీన్ కి ధియోట‌ర్స్ లో క్లాప్స్ ప‌డ‌తాయి. మా డైరెక్టర్ వంశీ కృష్ణ అకెళ్ళ ఎవరూ టచ్ చేయని పాయింట్ ని ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించారు. ప్రేమకథా చిత్రం తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ జక్కన్న చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. మా చిత్రంలో ఊహించని ట్విస్ట్ లు చాలా వుంటాయి. హీరోయిన్ మ‌న్నార్ చోప్రా పాత్ర కూడా చాలా అందంగా తీర్చిదిద్దాడు మా ద‌ర్శ‌కుడు. అలాగే మా చిత్రం ప్రేమ‌క‌థా చిత్రం లో స‌ప్త‌గిరి ఏ రేంజిలో న‌వ్వించాడో ఈ చిత్రంలో దాన్ని మించి న‌వ్విస్తాడు. స‌ప్త‌గిరి మంచి గెట‌ప్ లో క‌నిపిస్తాడు. రెండ‌వ వారంలో ఆడియో విడుదల చేసి, జులైలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. అని అన్నారు.

నటీనటులు: సునీల్, మన్నార్ చోప్రా, కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, ప్ర‌భాస్ శీను, చిత్రం శ్రీను, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, ఉదయ్, ఆనంద్ రాజ్, సత్య, వైవా హర్ష, వేణుగోపాల్, రాజశ్రీ నాయర్ తదితరులు నటించారు. సాంకేతిక వర్గం: బ్యానర్ - ఆర్ పి ఏ క్రియేషన్స్; సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్; మ్యూజిక్: దినేష్; ఆర్ట్ డైరెక్టర్ - మురళి; ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్; ఎడిటర్: ఎం.ఆర్.వర్మ; డైలాగ్స్: భవాని ప్రసాద్; స్టిల్స్ - వాసు; పిఆర్ఓ - ఏలూరు శ్రీను; కో ప్రొడ్యూసర్స్: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి; నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ అకెళ్ళ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil  Jakkanna  Mannar chopra  

Other Articles