కబాలి అభిమానులకు శుభవార్త | finally kabali audio release date confirmed

Finally kabali audio release date confirmed

Kabali audio release date, Kabali teaser, Kabali movie news, Kabali stills, Kabali posters, Kabali movie updates, Kabali, Rajinikanth

finally kabali audio release date confirmed: superstar rajinikanth upcoming film kabali. This film audio will be release on 11 june. Pa.Ranjith director.

కబాలి అభిమానులకు శుభవార్త

Posted: 06/03/2016 10:01 AM IST
Finally kabali audio release date confirmed

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కబాలి’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. గ్యాంగ్ స్టర్ గా రజనీకాంత్ లుక్స్ అదిరిపోయింది. టీజర్ తో ఈ సినిమాపై వున్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది.

కానీ తాజాగా ఆడియో రిలీజ్ పై చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను ఓ క్లారిటీ ఇచ్చేసారు. ఈ సినిమా ఆడియోను ఈనెల 11న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత ప్రకటించారు. ఈ వేడుకను చెన్నైలోని వైయంసీఎ గ్రౌండ్ లో అభిమానులు సమక్షంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం.

పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ ధన్సిక ఓ ముఖ్య పాత్రలో నటించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాను తెలుగు, తమిళం భాషలలో ప్రపంచ వ్యాప్తంగా జులై 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  Rajinikanth  Radhika apte  

Other Articles