bahubali team with chinese mendia for baahubali pramotions

Bahubali crew just entered to interact with the chinese media for baahubali movie promotions

bahubali team with chinese mendia for baahubali pramotions,

bahubali team with chinese mendia for baahubali pramotions,

చైనా లో బాహుబలి హవా...

Posted: 05/31/2016 12:37 PM IST
Bahubali crew just entered to interact with the chinese media for baahubali movie promotions

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి గుర్తింపు తెచ్చిన సినిమా 'బాహుబలి - ద బిగినింగ్'. ఈ సినిమా ఇటీవలే కేన్స్ సినిమా ఫెస్టివల్ లో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రంగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం 'బాహుబలి - ద కన్ క్లూజన్' పార్ట్ 2 గా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ షూటింగ్ లో తెగ బిజీగా ఉన్నారు. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైనా మీడీయా ముందుకు హాజరైంది చిత్రయూనిట్ మొత్తం. అందుకోసం ప్రభాస్, రానా, తమన్నాలు ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. రమా రాజమౌళి, వల్లీ కీరవాణి, సినిమా దర్శకుడు యస్ యస్ రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నట్లుగా సమాచారం తెలుస్తోంది.
 
దీనికోసం చిత్రయూనిట్ మొత్తం ఒక్కచోటకు చేరి సందడి చేశారు. 'బాహుబలి ద బిగినింగ్' పార్ట్ 1 సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? అన్న సస్పెన్స్ ని చివర్లో చూపించిన దర్శకుడు రాజమౌళి యావత్ ప్రపంచాన్ని అదే సందిగ్ధంలో ఉంచేశాడు. ఇప్పుడు 'బాహుబలి ద కన్ క్లూజన్' పార్ట్ 2 లో దాన్ని రివీల్ చేస్తూ , సినిమాకి మరో సీక్వెల్ కూడ ఉంటుందని చెప్తున్నాడు.

గతంలో జరిగిన అనేక ప్రెస్ మీట్స్ లో ఇదే విషయాన్ని వివరించాడు రాజమౌళి. ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రపంచ మీడియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aushka  rana  tamannaha  prabhas  prabhas baahubali  

Other Articles