అందుకోసం హీరోయిన్ వెంటపడ్డ దేవి | Lavanya Tripathi Photoshoot By Devi Sri Prasad

Lavanya tripathi photoshoot by devi sri prasad

Lavanya Tripathi Photoshoot, Lavanya Tripathi Photoshoot with DSP, Lavanya Tripathi Hot Photoshoot, Devi Sri Prasad Lavanya Tripathi Photoshoot, Devi Sri Prasad Photoshoot, Devi Sri Prasad songs, Devi Sri Prasad albums, Lavanya Tripathi Hot stills, Lavanya Tripathi stills

Lavanya Tripathi Photoshoot By Devi Sri Prasad: Glamourous actress Lavanya Tripathi has posed for few pictures for DSP. Devi Sri Prasad isn't just a music director but also a good photographer.

అందుకోసం హీరోయిన్ వెంటపడ్డ దేవి

Posted: 05/28/2016 12:59 PM IST
Lavanya tripathi photoshoot by devi sri prasad

సౌత్ ఇండియన్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు దేవి. కేవలం సంగీత దర్శకత్వమే కాకుండా పాటల రచయితగా, నటుడిగా, డాన్స్ కొరియోగ్రాఫర్ గా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆడియో వేడుకల్లో దేవి ఎనర్జీ హై లెవల్లో వుంటుంది. అలాంటి దేవికి ఫోటోగ్రఫి కూడా ఓ పాషన్.

ఫోటోగ్రఫి అంటే దేవికి చాలా ఇష్టం. అలాంటి దేవి తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠీతో ఓ ఫోటోషూట్ చేసాడు. అంతేకాకుండా ఈ ఫోటోషూట్ వీడియోను తానే ఎడిటింగ్, మ్యూజిక్ కంపోజ్ చేసి విడుదల చేసాడు. దేవి చేసిన ఫోటోషూట్ కు లావణ్య తెగ మురిసిపోతుంది. ‘దేవీకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం, నాతో ఓ క్యాజువల్ ఫోటో షూట్ చేస్తానని చాలా కాలంగా అడుగుతున్నాడు. ఇప్పటికి కుదిరింది. దేవీ నిజంగా అమేజింగ్ ఫోటోగ్రాఫర్’ అంటూ తెగ పొగిడేస్తుంది.

ప్రస్తుతం దేవి తెలుగు, తమిళంలోని పలు స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణ’, చిరంజీవి ‘కత్తిలాంటోడు’, ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ చిత్రాలతో బిజీగా వున్నాడు. మరి దేవి ఫోటోగ్రఫికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lavanya Tripathi  Devi Sri Prasad  Photoshoot  

Other Articles