పెళ్లి చేసుకున్న శింబు-నయనతార | Simbu and Nayantara got marriage

Simbu and nayantara got marriage

Simbu, Nayantara, Simbu married Nayantara, Nayantara Marriage, శింబు, నయనతార

South Indian Hero Simbu and Heroine Nayantara got marriage. Director Pandya Raj directing a film with Simbu and Nayantara.

పెళ్లి చేసుకున్న శింబు-నయనతార

Posted: 05/25/2016 08:22 AM IST
Simbu and nayantara got marriage

పలానా హీరోతో లవ్ స్టోరీ నడుపుతున్న హీరోయిన్.. పలానా హీరోయిన్ లవ్ స్టోరీ అలా ఉంది అంటూ రోజుకు కొన్ని వందల గాసిప్స్ సినిమా ఇండస్ట్రీల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ వాటన్నింటిలోకి సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ జంట మోస్ట్ పాపులర్. పెళ్లి దాకా వెళ్లిన ఆ జంట అనుకోని కారణాల వల్ల విడిపోయింది. ఇకపై కలిసి నటించరనుకున్న వివాదాస్పద ప్రేమ జంట శింబు – నయనతారలను, రియల్‌ లైఫ్‌లో విడిపోయిన ఈ ప్రేమజంటను రీల్‌ లైఫ్‌లో కలపి ఒక్కటి చేసి రొమాంటిక్‌ చిత్రాన్ని తెరకెక్కించి సంచలనం సృష్టించాడు దర్శకుడు పాండిరాజ్‌. బయట కనబడితే ఒకరినొకరు పలకరించుకోవడానికి కూడా ఇష్టపడని ఈ జంటతో ,ఏకంగా రొమాన్స్ చేయించేశాడు డైరెక్టర్.

రెండు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న ‘ఇదు నమ్మ ఆళు’ శింబు సినీ ఆర్ట్స్‌ పతాకంపై శింబు తండ్రి టి.రాజేంద్రన్ నిర్మించిన ఈ చిత్రం ,చివరకు పూర్తి చేసుకొని ,ఈ శుక్రవారం విడుదలకు సిద్దంగా ఉంది. ఆండ్రియా రెండో హీరోయిన్‌గా, శింబు సోదరుడు కురలరసన్ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అర్బన్ రొమాంటిక్‌ స్టోరీ అయిన ఈ చిత్రంలో , శింబు, నయనతారల మధ్య ప్రేమ సన్నివేశాలు, కథలో భాగంగా వీళ్లిద్దరిపై చిత్రీకరించిన పెళ్లి దృశ్యాలు చాలా ఆశక్తి కరంగా ఉంటాయి. ఈ సినిమాకి అదనపు ఆకర్షణ ఏమిటంటే , శింబు – ఆదాశర్మలపై చిత్రీకరించిన ‘మామా వెయిటింగ్‌’ ఐటమ్‌సాంగ్‌ చాల బాగా కుదిరిండంట .అన్నిటి కంటే ముఖ్యంగా 90 సెకన్లపాటు ఒంటి కాలుపై శింబు చేసిన డ్యాన్స్ మూమెంట్స్‌ హైలెట్ అని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles