పేరు మహేష్ బాబుది.. పండగ ఎన్టీఆర్ ది | NTR celebrating festival on Mahesh babu name

Ntr celebrating festival on mahesh babu name

Mahesh Babu, Brahmostavam, NTR, Young Tiger, Janata Garrage, బ్రహ్మోత్సవం, ఎన్టీఆర్, మహేష్, జనతాగ్యారేజ్

Tollywood star heros friendly clash going viral in social media. Young Tiger NTR celebrate his birth day with Janata Garrage First look posters.

పేరు మహేష్ బాబుది.. పండగ ఎన్టీఆర్ ది

Posted: 05/21/2016 11:07 AM IST
Ntr celebrating festival on mahesh babu name

పేరొకరిది.. నోరొకరిది.. అంటే ఇదే మరి. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా బ్రహ్మోత్సవం బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకుంది. ముందు నుండి ఊరించి. ఊరించి నిన్న విడుదలైన శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం బాక్సాఫీస్ వద్ద తుస్సుమంది. అయితే నిజానికి నిన్న బ్రహ్మోత్సవం సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అయినా కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పండగ చేసుకున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వచ్చిన పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

మహేష్ బ్రహ్మోత్సవం సందర్భంగా దాదాపు రెండు వారాల పాటు ఏ సినిమా కూడా విడుదలకావడం లేదు. కానీ బ్రహ్మోత్సవం మొదటి రోజే డివైడ్ టాక్ రావడంతో అందరూ షాక్ తిన్నారు. అయితే నిన్నటి శుక్రవారం మహేష్ బ్రహ్మోత్సవానిదే అనుకున్న వారికి షాక్ తగలగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకున్నారు. సైలెంట్ గా వచ్చిన జనతాగ్యారేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్లతో అందరిని కట్టిపడేశాడు. ఇప్పటికే భారీ అంచనాల మీదున్న జనతాగ్యారేజ్ ను మరింత పైప్ కు తీసుకెళ్లాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ టైమింగ్ అదిరింది అంటూ టాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారెు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles