వాళ్లకు స్వారీ చెప్పిన సూర్య | Suriya said sorry for those people

Suriya said sorry for those people

Suriya, Tamil, Tamilnadu, Surya, Surya24, Surya said sorry, Surya appeal to people, Suriya films, Suriya news, Suriya latest updates, సూర్య, సూర్య సినిమాలు, తమిళనాడు, ఎన్నికలు

Tamil super hero Surya said sorry to Tamilnadu people. He is in Amrica, So he cant utilize his vote in this election.

వాళ్లకు స్వారీ చెప్పిన సూర్య

Posted: 05/17/2016 09:54 AM IST
Suriya said sorry for those people

తమిళ సూపర్ స్టార్ సూర్య తాజాగా వార్తల్లో నిలిచాడు. ఆయన తమిళనాడు ప్రజలకు స్వారీ చెబుతూ తన మెసేజ్ ను పంపించారు. అదేంటి తమిళ స్టార్ హీరో సూర్య ఎందుకు స్వారీ చెబుతున్నారు..? అసలు స్వారీ చెప్పాల్సిన అవసరం ఏంటీ అనుకుంటున్నారా..? దానికి ఓ కారణం ఉంది. అదేంటి అంటే.. ప్రస్తుతం సూర్య24 సినిమా సక్సెస్ తర్వాత అమెరికాకు తన ఫ్యామిలీతో పాటుగా టూర్ వెళ్లారు. అయితే ఇక్కడే తాను చేసిన తప్పు తెలుసుకొని తమిళనాడు ప్రజలకు క్షమాపణలు కోరారు.

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చూసిన తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. తమిళనాడులోని ఓటర్లలో చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన అందరు స్టార్లు కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కానీ ప్రస్తుతం అమెరికాలో వెకేషన్ లో ఉన్న సూర్య మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. దాంతో ఆయన తాజాగా తమిళనాడు ప్రజలకు క్షమాపణలు చెబుతూ.. మెసేజ్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles