అంత తూచ్... పాపం అలగలేదట! | Nargis Fakhri Clarifies on her marriage rumors

Nargis fakhri clarifies on her marriage rumors

Nargis Fakhri Clarifies on her marriage rumors, Nargis Fakhri rumors, Nargis Fakhri love rumors, Nargis Fakhri marriage rumors, Nargis Fakhri tweets, Nargis Fakhri Uday Chopra love, Nargis Fakhri hot news, Nargis Fakhri stills

Nargis Fakhri Clarifies on her marriage rumors: Uday Chopra cancels marriage with Nargis Fakhri. Nargis Fakhri rubbishes marriage rumours to Uday Chopra

అంత తూచ్... పాపం అలగలేదట!

Posted: 05/13/2016 03:49 PM IST
Nargis fakhri clarifies on her marriage rumors

బాలీవుడ్ లో ప్రేమయాణాలు, బ్రేకప్ లు బాగా ఎక్కువయ్యాయి. తాజాగా మరో జంట ప్రేమ వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ హాట్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ తన ప్రియుడిపై అలిగి, షూటింగ్ మానేసి విదేశాలకు వెళ్లిపోయిందని వార్తలొస్తున్నాయి. గతకొద్ది రోజులుగా నర్గీస్ ఫక్రీ, బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రాలు ప్రేమలో వున్నారు.

వీరిద్దరూ గతంలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే అప్పట్లో గతంలో ఉదయ్ పెళ్లి చేసుకుందామన్న సమయంలో తన కెరీర్ మీద దృష్టి పెట్టిన నర్గీస్ ఫక్రీ పెళ్లికి నో చెప్పింది. ఇప్పుడు అదే ప్రస్తావనను నర్గీస్ తీసుకువచ్చినప్పుడు ఉదయ్ చోప్రా నో చెప్పాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యి, నర్గీస్ ఫక్రీ విదేశాలకు వెళ్లిపోయిందంటూ రకరకాల వార్తలొస్తున్నాయి.

అయితే తనపై వచ్చిన ఈ రూమర్లకు నర్గీస్ ఫక్రీ ఫుల్ స్టాప్ పెట్టింది. అనారోగ్యం కారణంగానే విదేశాలకు వెళ్లినట్లుగా ఆమె తెలియజేసింది. ఉదయ్ చోప్రా పెళ్లికి నిరాకరించడంతో అలిగి విదేశాలకు వెళ్లినట్లుగా వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని నర్గీస్ మేనేజర్ తెలిపారు.

ఏడాది నుండి తీరిక లేకుండా వరుసగా సినిమాలు చేయడంతో విశ్రాంతి తీసుకోవాలనే ఆమె భావించి న్యూయార్క్ వెళ్లారని తెలిపారు. పైగా ఆమెకు ఆరోగ్యం కూడా సరిగా లేదని, గాయాలతోనే 'అజర్' ప్రమోషన్ లో పాల్గొంటున్నారని వెల్లడించారు. దీంతో 'హౌస్ ఫుల్ 3' సినిమా నిర్మాత సాజిద్ నదియావాలా అనుమతి తీసుకుని నూయార్క్ కు వెళ్లిపోయిందని ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్లనే ‘హౌస్ ఫుల్3’ ప్రమోషన్స్ కూడా దూరంగా వుండి, నెలరోజులు విశ్రాంతి తీసుకుంటారని చెప్పుకొచ్చారు.

మరి తన ప్రేయసికి అనారోగ్యంగా వుంటే ప్రియుడు ఎక్కడ వున్నాడు? ఏం చేస్తున్నాడో అంటూ బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఈ అమ్మడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలతో బాగా పాపులర్ అవుతోంది.

 

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nargis Fakhri  Uday Chopra  Love  hot stills  

Other Articles