ధూమ్3 కంటే స్పీడుగా వున్నాడయ్యో! | Kabali Teaser Creates Records

Kabali teaser creates records

Kabali Teaser Creates Records, Kabali Release Date Postponed, Kabali movie postponed, Kabali release dates, Kabali Teaser, Kabali latest updates, Kabali movie details, Kabali stills, Kabali posters, Kabali, Rajinikanth

Kabali Teaser Creates Records: Tamil superstar rajinikanth latest film kabali. Ranjith director. Radhika apte, dhansika acts in important roles.

ధూమ్3 కంటే స్పీడుగా వున్నాడయ్యో!

Posted: 05/13/2016 05:07 PM IST
Kabali teaser creates records

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన క్రేజ్ ఏంటో చూపిస్తున్నాడు. రజనీకాంత్ నటిస్తున్న ‘కబాలి’ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తుంది. ఇప్పటివరకు వున్న రికార్డులను బద్దలుకొట్టి మొదటి స్థానంలో నిలిచింది. విడుదలైన 22 గంటల్లోనే ‘కబాలి’ టీజర్ 50 లక్షలకు పైగా హిట్లు సంపాదించి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఈ టీజర్ను కోటి 71 లక్షల మంది వీక్షించారు.

అత్యధిక హిట్లు వచ్చిన ఇండియన్ ఫిల్మ్ టీజర్గా ‘కబాలి’ రికార్డు సాధించింది. ‘కబాలి’ దూకుడుకు సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’, అమీర్ ఖాన్ ‘ధూమ్3’ సినిమాల టీజర్ల రికార్డులు బద్దలు అయ్యాయి. ఈ టీజర్లో రజనీకాంత్ డైలాగ్స్, స్టైల్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. మొత్తానికి కేవలం ఒక్క టీజర్ ఇండియాలో భారీ రికార్డ్ క్రియేట్ చేసి, బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తుంది.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో రజనీ సరసన రాధిక ఆప్టే హీరోయిన్ గా నటిస్తుంది. హీరోయిన్ ధన్సిక ముఖ్య పాత్రలో నటిస్తుంది. పి.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  Rajinikanth  Radhika Apte  

Other Articles