కృష్ణగాడి ప్రేయసితో మెగా హీరోలు | Mehreen romance with two mega heros

Mehreen romance with two mega heros

Mehreen romance with two mega heros, Mehreen movies, Mehreen movie updates, Mehreen hot stills, Mehreen latest stills, Mehreen upcoming films, Mehreen

Mehreen romance with two mega heros: Krishnagadi Veerapremagadha actress Mehreen upcoming films with two mega heros.

కృష్ణగాడి ప్రేయసితో మెగా హీరోలు

Posted: 05/11/2016 03:36 PM IST
Mehreen romance with two mega heros

‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాలో తన క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, స్మైల్, యాక్టింగ్ తో కుర్రకారును ఆకట్టుకున్న హీరోయిన్ మెహరీన్.... ఈ సినిమా తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సినిమా విడుదలై ఘనవిజయం సాధించడంతో వరుసగా ఆఫర్లు వచ్చిపడ్డాయి. అయినా కూడా ఈ అమ్మడు చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు ఇద్దరు మెగా హీరోలతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమయ్యింది. ఒకేసారి ఇద్దరు మెగా హీరోలతో నటించే అవకాశం దక్కించుకొని, మెగా కంపౌండ్ లోకి మెగా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. సాయిధరమ్ తేజ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాలో మెహరీన్ ను హీరోయిన్ గా ఇప్పటికే ఫైనలైజ్ చేసారు.

ఇక అలాగే అల్లు శిరీష్ హీరోగా ఎంవీఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఓ తాజా చిత్రంలో మెహరీన్ హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా షూటింగ్ లో శిరీష్ బిజీగా వున్నాడు. ఈ సినిమా పూర్తైన వెంటనే తన కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే అన్ని వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mehreen  Sai Dharam Tej  Allu Sirish  

Other Articles