బిగ్ బీని వదలని అధికారులు | Amitabh Bachchan Tax Case Again

Amitabh bachchan tax case again

Amitabh Bachchan Tax Case Again, Amitabh Bachchan 2001 case, Amitabh Bachchan 2001 tax case, Amitabh Bachchan latest case, Amitabh Bachchan supreme court, Amitabh Bachchan latest updates, Amitabh Bachchan

Amitabh Bachchan Tax Case Again: Today the Supreme Court has dismissed Bombay High Court's decision on Amitabh Bachchan's Income Tax.

బిగ్ బీని వదలని అధికారులు

Posted: 05/11/2016 02:52 PM IST
Amitabh bachchan tax case again

బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కు పాతకేసు మళ్లీ చిక్కులు తెచ్చిపెట్టింది. అమితాబ్ బచ్చన్ పై 2001 సంవత్సరంలో ఆదాయపు పన్ను కేసును మళ్లీ ప్రారంభించేందుకు ఆదాయపు పన్ను శాఖకు సుప్రీంకోర్టు అనుమతిని మంజూరు చేసింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.

గతంలో అమితాబ్ బచ్చన్ ‘కెబిసి’ లో నటించారు. ఇందుకు బిగ్ బీ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఈ షో భారీ హిట్టవ్వడంతో అమితాబ్ అడిగినంత రెమ్యునరేషన్ ను అందించారు నిర్వాహకులు. అయితే ఈ షో ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి 2001-02 సంవత్సరంలో బిగ్ బీ కోటి 66 లక్షల రూపాయల పన్నుల చెల్లించకుండా బాకీ పడ్డట్లుగా ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది.

అయితే ఈ కేసును అప్పట్లో విచారించిన బాంబే హైకోర్టు 2012 జులైలో బిగ్ బీకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ తాజాగా బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆదాయపు పన్ను శాఖ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును మళ్లీ ప్రారంభించేందుకు ఆదాయపన్ను శాఖకు బుధవారం రోజున సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachchan  Case  Bollywood  

Other Articles