కబాలి విడుదలకు కష్టాలు | Kabali Release Date Postponed

Kabali release date postponed

Kabali Release Date Postponed, Kabali movie postponed, Kabali release dates, Kabali Teaser, Kabali latest updates, Kabali movie details, Kabali stills, Kabali posters, Kabali, Rajinikanth

Kabali Release Date Postponed: Tamil superstar rajinikanth latest film kabali. Ranjith director. Radhika apte, dhansika acts in important roles.

కబాలి విడుదలకు కష్టాలు

Posted: 05/10/2016 01:09 PM IST
Kabali release date postponed

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కబాలి’. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫోటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ రికార్డులను షేక్ చేసింది.

ప్రపంచంలో ఎక్కువ లైక్స్ పొందిన రెండవ వీడియోగా ‘కబాలి’ టీజర్ రికార్డుకెక్కింది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో రజనీ సరసన రాధిక ఆప్టే హీరోయిన్ గా నటిస్తుంది. హీరోయిన్ ధన్సిక ముఖ్య పాత్రలో నటిస్తుంది. అసలే విడుదలకు సిద్ధంగా వున్న ‘కబాలి’ మరో నెల రోజుల పాటు విడుదల కాకుండా వాయిదా పడే అవకాశాలున్నట్లుగా కనిపిస్తోంది.

జూన్ 3వ తేదిన ‘కబాలి’ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. కానీ తమిళనాడులో ఎన్నికల సంధర్భంగా విడుదల తేదిని మరో నెల రోజుల పాటు వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 3న కాకపోతే జులై 1వ తేదిన ‘కబాలి’ విడుదలయ్యే అవకాశాలున్నాయి. జూన్ లో విడుదల చేస్తే వేసవి సెలవుల కానుకగా భారీ కలెక్షన్లు రాబట్టొచ్చు.. కానీ ఆ తర్వాత విడుదల చేస్తే అంతగా కలెక్షన్లు వస్తాయో లేదోనని చిత్ర నిర్మాతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా విడుదల తేదిని ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  Rajinikanth  Radhika Apte  

Other Articles