బ్లాక్ బస్టర్ దెబ్బకు 100కోట్లు | Sarrainodu 100 crores gross collections

Sarrainodu 100 crores gross collections

Sarrainodu 100 crores gross collections, Sarrainodu collections, Sarrainodu movie posters, Sarrainodu records, Sarrainodu stills, సరైనోడు, అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా, బోయపాటి శ్రీను, Allu Arjun, Rakul Preet singh, సినిమాలు, రాజకీయాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, Fun, Entertainment, Spicy Videos, Movies, News, Gossips, Sports, Fashion, Style, Comedy, Hotels, Tickets, Hot stills

Sarrainodu 100 crores gross collections: Stylish star allu arjun latest blockbuster film Sarrainodu. Boyaparti srinu director.

బ్లాక్ బస్టర్ దెబ్బకు 100కోట్లు

Posted: 05/10/2016 12:00 PM IST
Sarrainodu 100 crores gross collections

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఇప్పటివరకున్న స్టైలిష్ స్టార్ ను కాస్త ‘ఊరమాస్’ లుక్ లో చూసేసరికి అభిమానులు చాలా సంతోషంగా వున్నారు. పైగా బన్నీ ఊరమాస్ లుక్ కూడా స్టైలిష్ గా వుండటం మరింత ప్లస్ అయ్యింది.

బోయపాటి శ్రీను కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ చిత్రాలను తీయడంలో దిట్ట అని మరోసారి నిరూపించుకున్నాడు. బన్నీ పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్లో చూపించి మెప్పించాడు. వీరిద్దరి స్టైలిష్, మాస్ కు ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కూడా సెట్ అవ్వడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇక అసలు కథ ఏంటంటే.. ఈ సినిమా విడుదలైన 17 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా సరైనోడు దుమ్మురేపుతోంది. ఏప్రిల్ 22న విడుదలైన సరైనోడు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇది బన్నీ ఖాతాలో ఓ సంచలన రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ఇక షేర్స్ పరంగా 60కోట్లకు పైనే సాధించింది. సినిమా కలెక్షన్ల మోత మోగిస్తుండటంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా వున్నారు. మరి భవిష్యత్తులో ‘సరైనోడు’ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేయనున్నాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles