మరో ఇద్దరితో మిక్కీ ‘బ్రహ్మోత్సవం’ బద్దలు | Mickey J Meyer three films ready to release

Mickey j meyer three films ready to release

Mickey J Meyer three films ready to release, Mickey J Meyer Music Albums, A Aa songs Jukebox, A Aa songs, Brahmotsavam songs, Brahmotsavam trailers, Brahmotsavam videos, Okka Ammayi Tappa songs, Okka Ammayi Tappa trailers, Okka Ammayi Tappa vides, Fun, Entertainment, news, movies, stills

Mickey J Meyer three films ready to release: Music Director Mickey J Meyer upcoming films Brahmotsavam, Okka Ammayi Tappa, and A Aa. This three films ready to release.

మరో ఇద్దరితో మిక్కీ ‘బ్రహ్మోత్సవం’ బద్దలు

Posted: 05/09/2016 05:19 PM IST
Mickey j meyer three films ready to release

మొన్నటివరకు దేవిశ్రీప్రసాద్, థమన్ లు వరుస సినిమాలతో మోత మోగించారు. ఆ తర్వాత వీరిద్దరితో పాటు అనూప్ రూబెన్స్ కూడా వరుస సినిమాలతో అదరగొట్టాడు. అయితే వీరి ముగ్గురికి పోటీగా ఇపుడు మరో సంగీత దర్శకుడు కూడా యమ స్పీడుమీదున్నాడు. ‘హ్యాపీడేస్’, ‘కొత్తబంగారులోకం’ వంటి సినిమాల తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో కమర్షియల్ హిట్ ను సొంతం చేసుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి.జే.మేయర్.

ఆ తర్వాత పలు సినిమాలకు సంగీతం అందించినప్పటికీ.. అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఇటీవలే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాతో మరోసారి హిట్ కొట్టాడు. కానీ ఈ 2016వ సంవత్సరంలో.. అది కూడా రెండు నెలల వ్యవధిలోనే వరుసగా తన కొత్త సినిమాలు మూడు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. అవి కూడా భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం.

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న ‘అఆ’ చిత్రానికి మిక్కీ.జే.మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులోని అన్ని పాటలు కూడా సాహిత్యం, సంగీతం పరంగా చాలా బాగున్నాయి. అన్ని పాటలు వినసొంపుగా, ఆహ్లాదకరంగా వున్నాయి.

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు కూడా మిక్కీ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పాటలు ఇటీవలే ఘనంగా విడుదలయ్యాయి. ఈ పాటలు కూడా చాలా బ్యూటీఫుల్ గా వున్నాయి. ఇందులో ‘వచ్చింది కదా అవకాశం..’ అనే పాట సూపర్ హిట్టయ్యింది. పాటలన్నీ కూడా బాగున్నాయి.

ఇక సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. బ్యూటీఫుల్ లవ్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు మిక్కీ అదిరిపోయే సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా పాటలు తాజాగా విడుదలయ్యాయి. ఇందులోని పాటలు చాలా కొత్తగా వున్నాయి. కొన్ని పాటలు మిక్కీ గతంలో సంగీతం అందించిన పాటల కంటే కొత్తగా వున్నాయి.

ఈ మూడు సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. అది కూడా రెండు నెలల వ్యవధిలోనే విడుదలకాబోతుండటం విశేషం. పైగా ఈ సమయంలో మిగతా సంగీత దర్శకుల సినిమాల విడుదల, ఆడియో విడుదల కార్యక్రమాలు లేకపోవడం మిక్కీకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మరి ఈ మూడు సినిమాలు మిక్కీకి భవిష్యత్తులో ఎలాంటి సక్సెస్ ను అందజేస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brahmotsavam  Okka Ammayi Tappa  A Aa  

Other Articles