పవన్ కళ్యాణ్ తనయుడికి గాయాలు | Pawan Kalyan Son Akira Injured

Pawan kalyan son akira injured

Pawan Kalyan Son Akira Injured, Akira injured, Akira met accident, Akira accident, Akira hospitalized, Akira health news, Pawan kalyan son, accident ot pawan kalyan son, Akira nandan, pawan kalyan son injured

Pawan Kalyan Son Akira Injured: Powerstar Pawan kalyan son Akira met with an accident. Akira Nandan’s hand got fractured during the bicycle accident.

పవన్ కళ్యాణ్ తనయుడికి గాయాలు

Posted: 05/09/2016 03:09 PM IST
Pawan kalyan son akira injured

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ప్రమాదంలో గాయపడ్డాడు. అకీరా చేతికి ఫ్రాక్చర్ కూడా అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అకీరా సైకిల్ పై నుంచి పడటంతో గాయాలయ్యాయని, వెంటనే ఓ పేరున్న హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పటికీ చికిత్స చేయడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చూపించారని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది.

గాయపడిన వ్యక్తికి వైద్యం అందించకుండా వైద్యులు ఆలస్యం చేసారని, బాధతో ఎదురుచూడాల్సి వచ్చిందని రేణు అన్నారు. చికిత్స కోసం పెద్ద హాస్పిటల్లకు వెళ్లడం కంటే చనిపోవడం నయమని, డాక్టర్ల నుంచి నర్సుల వరకు మొత్తం వ్యవస్థ నిర్లక్ష్యం మానవత్వాన్ని చంపేస్తోందని రేణుదేశాయ్ తన భాధను వ్యక్తం చేసారు.

అలాగే అకీరా చేతికి ఫ్రాక్చర్ అయ్యిందని, అలాగే ముఖం, భుజాలు, మోకాలు, మోచేతి ప్రాంతాలలో కూడా గాయాలైనట్లుగా రేణు చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం అకీరా క్షేమంగా వున్నాడని, అకీరా ఆరోగ్యం కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ రేణుదేశాయ్ ట్వీట్ చేసింది. మరి అకీరాకు గాయాలైనట్లుగా పవన్ కళ్యాణ్ కు సమాచారం అందిందో లేదో? పవన్ తో విడిపోయాక తన ఇద్దరు పిల్లలతో(అకీరా, ఆధ్య) రేణుదేశాయ్ పూణెలో వుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Akira  Renu Desai  

Other Articles