దుమ్మురేపుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ టైటిల్ సాంగ్ | Gautamipurta Satakarni Fan Made Song

Gautamipurta satakarni fan made song

Gautamipurta Satakarni Fan Made Song, Gautamipurta Satakarni movie updates, Gautamipurta Satakarni stills, Gautamipurta Satakarni posters, రాజకీయాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, Fun, Entertainment, Spicy Videos, Movies, News, Gossips, Sports, Fashion, Style, Comedy, Hotels, Tickets, Balakrishna stills

Gautamipurta Satakarni Fan Made Song: Nandamuri Balakrishna 100th film Gautamipurta Satakarni Shootings Starts Today. Krish Director.

దుమ్మురేపుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ టైటిల్ సాంగ్

Posted: 05/09/2016 12:47 PM IST
Gautamipurta satakarni fan made song

నందమూరి నటసింహం బాలకృష్ణ తన 100వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన క్షణం నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య తన 100వ చిత్రం చారిత్రాత్మక కథాంశం ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’తో రానున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి మొరాకోలో ప్రారంభం కానున్నాయి.

అయితే ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఓ ‘ఫ్యాన్ మేడ్’ టీజర్ ను సిద్ధం చేసి, విడుదల చేసారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. పలు బాలీవుడ్ సినిమాల నుంచి సీన్లను ఎడిట్ చేసినట్లుగా కనిపిస్తోంది. కానీ తాజాగా బాలయ్య ఫ్యాన్స్ ఈ ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ సినిమా కోసం ఓ టైటిల్ సాంగ్ ను రూపొందించారు.

రవిశంకర్ సంగీతం అందించిన సిరాశ్రీ సాహిత్యాన్ని అందించారు. రోహిత్ అద్భుతంగా ఆలపించారు. ఈ ఫ్యాన్ మేడ్ టైటిల్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. నిజంగా సినిమాలో ఈ పాట వుందనిపించే విధంగా వుంది. చాలా ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ గా ఈ పాటను రూపొందించారు. గౌతమీపుత్ర శాతకర్ణీ ధీరత్వం, వ్యక్తిత్వంను తెలియజేసే విధంగా వుంది. ఈ పాటకు బాలయ్య ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ ఫస్ట్ లుక్ టీజర్, పాటలు విడుదలయ్యే వరకు బాలయ్య ఫ్యాన్స్ ఇలాగే ఈ సినిమా గురించి ఏదో ఒక ‘ఫ్యాన్ మేడ్’ పాటలు, టీజర్లు, పోస్టర్లను డిజైన్ చేస్తూ విడుదల చేస్తూనే వుండేలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై బిబో శ్రీనివాస‌రావు స‌మ‌ర్పణ‌లో వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్లమూడి సాయిబాబు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Gautamipurta Satakarni  Movie News  

Other Articles