The Jungle Book nonstop collections continues even in fifth week

The jungle book earns all time high net profit of rs 173 crores

Taran Adarsh, Mumbai, Hollywood filmmaker, Jon Favreau, 3D live animation, The Jungle Book, Indian box office collection, CACW indian business,the jungle book,TJB 30 days collection,TJB 5th weekend collection,TJB collection record,box office collection,Chris Evans

"The Jungle Book" collected Rs. 2.09 crore nett at the Indian box office on its fifth Friday and Saturday. Its 30-day nett Indian collection stands at Rs. 173.04 crore.

ఆల్టైమ్ హై కలెక్షన్లతో ‘ది జంగిల్ బుక్’ రికార్డు

Posted: 05/08/2016 02:36 PM IST
The jungle book earns all time high net profit of rs 173 crores

హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' అంచనాలను మించి పయనిస్తుంది. భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబడుతూ రెట్టించిన జోరుతో ముందుకు దూసుకెళ్తోంది. భారతీయ చలనచిత్రం రంగంలోకి విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు 240 కోట్ల రూపాయలు (గ్రాస్) వసూలు చేయగా, నెట్ కలెక్షన్లు 173 కోట్ల రూపాయల వరకు అర్జించింది. ఈ మేరకు సినీ విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

సరిగ్గా నెల రోజుల క్రితం అంటే ఏప్రిల్ 8న భారత్ లో విడుదలైన ఈ చిత్రం కనీవిని ఎరుగని రీతిలో కలెక్షన్లను సంపాదిస్తుంది. ఇప్పటి వరకు మన దేశంలో విడుదలైన ఏ ఇతర హాలీవుడ్ చిత్రం కూడా ఇంతపెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టలేదు. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ.. భారతీయ చిత్రాలకు దీటుగా ప్రదర్శితమవుతోంది.  ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయగా, రమారమి అన్ని బాషల్లో ఈ చిత్రం సూపర్ కలెక్షన్లతో ప్రదర్శింపబడుతోంది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  Hollywood filmmaker  Jon Favreau  3D live animation  The Jungle Book  

Other Articles