జ్ఞాపకాల పొదరిల్లు అ..ఆ ట్రైలర్ | Trivikarams A..Aa cinema trailer out

Trivikarams a aa cinema trailer out

A..Aa, A..Aa trailer, A..Aa official Trailer, trivikram, Nithin, Samantha, Trivikram's A..Aa, త్రివిక్రమ్, అ..ఆ, అ..ఆ ఆడియో, అ..ఆ ట్రైలర్, నితిన్, సమంత

Trivikram and Nithis A..Aa audio launched. Pawan Kalyan attend the Audio functin as cheaf guest. A..Aa trailer going very viral in social media.

జ్ఞాపకాల పొదరిల్లు అ..ఆ ట్రైలర్

Posted: 05/03/2016 07:49 AM IST
Trivikarams a aa cinema trailer out

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ కాంబినేషన్లో వస్తున్న అ..ఆ సినిమా ఆడియో లాంఛ్ అయింది. మిక్కీజే మేయర్ మ్యూజిక్ డైరెక్షన్ లో పాటలు అద్భుతంగా వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసిన అ..ఆ ట్రైలర్ అఫీషియల్ గా రిలీజ్ అయిపోయింది. త్రివిక్రమ్ సెల్లూలాయిడ్ మార్క్ మరోసారి అ.. ఆ ద్వారా కనిపించింది.
ఇద్దరు వ్యక్తుల స్టోరీని మూడు రకాలు చెప్పొచ్చు అంటూ ప్రారంభమయ్యే ట్రైలర్ చాలా క్లాస్ గా అనిపించింది.

తెలుగు దర్శకుల్లో ఆయన మాటలే తూటాలుగా ఎలా పేలతాయో త్రివిక్రమ్ మాట్లాడితే అలాగే ఉంటుంది. త్రివిక్రమ్ మార్క్ తో మరో అత్తారింటికి దారేదిలాగా అందరిని ఆకట్టుకుంటుంది అని అందరూ భావిస్తున్నారు. ఈ సమ్మర్ లో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఆడియో ఫంక్షన్ లో పవన్ నితిన్ గురించి మాట్లాడారు. నితిన్ కి తానంటే అంతిష్టమని తెలియదని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఈ రోజు చెప్పేంతవరకు తనకు తెలియదని ఆయన అన్నారు. నితిన్ ని మొదట చూడగానే తనకు చాలా ప్రేమగా, తన తమ్ముడిలా అనిపించాడని అందుకే నితిన్ 'ఇష్క్' సినిమా ఆడియోకు వచ్చానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles