‘రాయ్’ తో రాంగోపాల్ వర్మ రెడీ | Ramgoapl varma ready with Rai

Ramgoapl varma ready with rai

RGVmGopalVarma, RAI, RAI teaser, Vivek Oberoi, రాంగోపాల్ వర్మ, రాయ్, వివేక్ ఒబేరాయ్

Sensational Director RamGopal Varma getting ready with his latest cinema RAI. RGV recently releas the RAI first look poster.

‘రాయ్’ తో రాంగోపాల్ వర్మ రెడీ

Posted: 05/02/2016 04:05 PM IST
Ramgoapl varma ready with rai

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి రియల్ స్టోరీతో సినిమా తీస్తున్నాడు. ఎప్పుడూ గ్యాంగ్ స్టర్ల కథలతో సినిమాలు తీసే రాంగోపాల్ వర్మ మరోసారి అలాంటి కథతోనే మన ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సారి ఆయన సెలక్ట్ చేసుకున్న కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కేవలం 30 రూపాయలతో ప్రారంభించిన ఓ గ్యాంగ్ స్టర్.. ఏకంగా 30వేల కోట్లకు ఎదిగిన రియల్ క్రిమినల్ స్టోరీతో మరోసారి తెర మీదకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశాడు రాంగోపాల్ వర్మ.

ముంబై అండర్ వరల్డ్ డాన్ లను మించిన రాయ్ అనే ఓ గ్యాంగ్ స్టర్ ఎలా 30 ఏళ్లలో చీకటి సామ్రాజ్యానికి చక్రవర్తిగా మారాడు అన్నది తెర మీద చూడాలి. ఎన్నో మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్నా కానీ కేవలం రెండు సంవత్పరాల్లో ఎలా బయటకు వచ్చారు అన్నది ఎంతో ఇంట్రస్టింగ్ సబ్జెక్టు. ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాయ్’. గ్యాంగ్ స్టర్ ముత్తప్ప రాయ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు.



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles