శృతి చేతిలో గోపిచంద్ ‘ఆక్సిజన్’ | Shruti Haasan Launches Gopichand Oxygen Motion Poster

Shruti haasan launches gopichand oxygen motion poster

Gopichand Oxygen Motion Poster Release Today, Gopichand Oxygen Poster, Gopichand Oxygen movie updates, Gopichand Oxygen movie news, Gopichand Oxygen movie details, Gopichand Oxygen, Gopichand movies, Gopichand movie news, Gopichand stills, Gopichand

Shruti Haasan Launches Gopichand Oxygen Motion Poster: Tollywood hero Gopichand upcoming film Oxygen. AM Jyothi krishna direction, S Aishwarya producer. Rashi khanna heroine.

శృతి చేతిలో గోపిచంద్ ‘ఆక్సిజన్’

Posted: 04/28/2016 11:26 AM IST
Shruti haasan launches gopichand oxygen motion poster

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌'. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ఏప్రిల్ 28, గురువారం నాడు ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ చేతుల మీదుగా విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 28న సాయంత్రం 5 గంటలకు శృతిహాసన్ ఆక్సిజన్ మోషన్ పోస్టర్ ను యూ ట్యూబ్, ట్విట్టర్ లో విడుదల చేస్తున్నారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు విడుదల కానున్న ఈ మోషన్ పోస్టర్ ను అద్యంతం విన్నూత్నంగా ఉండేలా రూపొందించారు.

ఈ చిత్రం ఇప్పటికి మూడు షెడ్యూల్స్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రముఖ నటుడు జగపతిబాబు ఇందులో కీలకపాత్రలో కనిపిస్తున్నారు. గోపీచంద్ బాడీలాంగ్వేజ్ కు తగిన విధంగా, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ తో ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు జ్యోతికృష్ణ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

గోపీచంద్‌, జగపతిబాబు, రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్, ,కిక్‌ శ్యామ్‌, ఆలీ, బ్రహ్మజీ, సితార, అభిమన్యుసింగ్, షాయాజీషిండే,చంద్రమోహన్, సుధ, ప్రభాకర్, అమిత్, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్‌:పీటర్ హెయిన్, కొరియోగ్రఫీ: బృంద, ఆర్ట్‌: మిలన్‌, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopichand  Oxygen  First Look Poster  stills  Rashi khanna  

Other Articles

Today on Telugu Wishesh