దుమ్మురేపుతున్న మహేష్ ఎంట్రీ | Brahmotsavam Motion Poster

Brahmotsavam motion poster

Mahesh Babu Brahmotsavam Motion Poster, Brahmotsavam Audio Release Date, Brahmotsavam Movie Overseas Rights News, Brahmotsavam Movie updates, Brahmotsavam Movie stills, Brahmotsavam Movie trailers, Brahmotsavam movie news, Brahmotsavam Movie shooting, Brahmotsavam Movie cast, Brahmotsavam, Mahesh babu, Samantha, Kajal, Praneetha

Brahmotsavam Motion Poster: Brahmotsavam 2016 movie motion poster ft Mahesh Babu, Samantha, Kajal Aggarwal and Pranitha Subhash. #BrahmotsavamBegins with the audio launch on May 7th.

దుమ్మురేపుతున్న మహేష్ ఎంట్రీ

Posted: 04/28/2016 09:18 AM IST
Brahmotsavam motion poster

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సందడి షురూ అయ్యింది. ‘శ్రీమంతుడు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత మహేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. పివిపి బ్యానర్ పై నిర్మాత పరల్.వి.పోట్లూరి నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో మహేష్ గెటప్ అదిరిపోయింది. అసలు మహేష్ ఇలా ఎంట్రీ ఇస్తాడని ఎవరూ ఊహించలేదు. రంగురంగుల రిబ్బెన్లతో కూడిన ఓ బుల్లెట్ పై మహేష్ ఎంట్రీ బాగుంది. ఈ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత మరోసారి మహేష్ సినిమాకు మిక్కీజేమేయర్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా ఆడియోను మే 7వ తేదిన విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బ్రహ్మోత్సవం’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటుంది. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీతలు జతకట్టారు. వేసవి సెలవుల కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Mahesh Babu  Brahmotsavam  Samantha  Kajal  Praneetha  

Other Articles