బాలకృష్ణను కేసీఆర్ అడిగిన కోరిక ఏంటంటే | Telangana CM KCR request to Balakrishna

Telangana cm kcr request to balakrishna

KCR, balakrishna, nandamuri Balakrishna, Balayya, Balayya cinema, Gautamiputra Satakarni, Gautamiputra Satakarni launch, Gautamiputra Satakarni cinema, Gautamiputra Satakarni pooja

Nandamuri Balakrishnas 100th film Gautamiputra Satakarni Movie Launched today in Annapurna studios, Telangana cm KCR request to show Gautamiputra Satakarni for his family.

బాలకృష్ణను కేసీఆర్ అడిగిన కోరిక ఏంటంటే

Posted: 04/22/2016 11:14 AM IST
Telangana cm kcr request to balakrishna

నందమూరి బాలకృష్ణ వందవ సినిమా ‘గౌతమిపుత్రశాతకర్ణి’ పూజా కార్యక్రమం ఈ ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావులతో పాటు చాలా మంది విచ్చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమంలో పాలుపంచుకున్న కేసీఆర్ మాట్లాడుతూ బాలకృష్ణ విలక్షణ నటనను పొగిడారు. కాగా ఈ సినిమా ప్రారంభంలో తన కోరికను బాలకృష్ణతో విన్నవించుకున్నారు కేసీఆర్.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తాను నందమూరి తారకరామారావు అభిమానిని అని వెల్లడించారు. అన్నగారి వారసుడిగా, నందమూరి నటసింహంగా బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్రశాతకర్ణి సక్సెస్ కావాలని కోరుకున్నారు. బాలయ్య వందో సినిమా రెండు వందల రోజులు ఆడుతుందని ఆయన ఆకాంక్షించారు. కేసీఆర్ బాలయ్ వందో చిత్రంను ప్రత్యేకంగా తమ కోసం ప్రదర్శించాలని ఆయన కోరారు. చిరంజీవితో కలిసి కుటుంబ సమేతంగా సినిమా చూస్తానని కేసీఆర్ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles