Dilip Kumar 'Recovering Well, Reports Normal' says Saira Banu

Dilip kumar stable but not out of danger says doctor

dilip kumar, dilip kumar news, dilip kumar health, dilip kumar hospital, dilip kumar doctor, dilip kumar latest news, dilip kumar hospital news, dilip kumar movies, dilip kumar wife, dilip kumar saira banu, entertainment news

"Dilip sahab's condition is stable since the time of admission... hasn't deteriorated but is slightly better," said the doctor.

నిలకడగా కొలుకుంటున్న నటదిగ్గజం దిలీఫ్ కుమార్..

Posted: 04/17/2016 03:54 PM IST
Dilip kumar stable but not out of danger says doctor

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌ (93) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, ప్రమాదం దాటిపోయిందని మాత్రం చెప్పలేమని అన్నారు. అవసరమైన అన్ని పరీక్షలు చేస్తున్నామని, ఆస్పత్రిలో చేరిన సమయం కన్న ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో దిలీప్ కుమార్ ను శనివారం ఉదయం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. ఆయన నిమోనియాతో బాధపడుతున్నట్టుగా సన్నిహితులు తెలిపారు.

జ్వరంతో పాటు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉండటంతో ఆసుపత్రిలో చేర్చినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. 'దిలీస్ సాబ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు కొంచెం పర్వాలేదని చెప్పిన కుటుంబసభ్యలు.. ఆయన పరిస్థితి మాత్రం కొంత ఆందోళనగానే వుందన్నారు. దిలీప్ కుమార్ ఆరోగ్యానికి అపాయం తప్పినట్లు మాత్రం చెప్పలేమన్నారు. కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయాల్సి ఉంది. మరో 48 గంటలు గడిచిన తర్వాత స్పష్టమైన్ ఆరోగ్య సమాచారం వెల్లడిస్తాం' అని జలీల్ పార్కర్ అనే వైద్యుడు తెలిపారు.

ఊపిరితిత్తుల్లో కొంత సమస్యను గుర్తించామని, అవి కొంత చెడిపోయాయని కూడా వెల్లడించారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమల దిలీప్ కుమార్ గా ఫేమస్ అయిన ఆయన అసలు పేరు మహ్మద్ యూసుఫ్ ఖాన్, దేవదాసు సినిమాతో ఉత్తరాది ప్రేకకులతో ట్రాజెడీ కింగ్ గా పిలిపించుకున్న దిలీప్ అందాజ్, దీదర్, మొగళ్ ఈ అజమ్ లాంటి సినిమాలతో  సూపర్ స్టార్ గా ఎదిగారు. 1998లో నటించిన ఖిలా ఆయన చివరి సినిమా.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dilip Kumar  bollywood  doctor  stable  hospital  danger  

Other Articles