Avatar | 4 parts | James Cameron | sequels | Release dates

Avatar will be released on 4 parts

Avatar film will be released on 4 parts, Avatar 4 parts, Avatar parts release dates, Avatar film latest updates, Avatar movie details, Avatar parts, sequels, James Cameron

Avatar will be released on 4 parts: Avatar will be getting not two, but three sequels. Avatar 2 will be released in December 2018.

2023 వరకు ‘అవతార్’ సందడి

Posted: 04/16/2016 09:22 AM IST
Avatar will be released on 4 parts

ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఒక్కసారిగా చర్చించుకునేంతా విజువల్ వండర్ గా రూపొందిన చిత్రం ‘అవతార్‘. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ గ్రాఫిక్స్, విజువల్స్ వండర్ తీర్చిదిద్దబడింది.
‘టెర్మినేటర్, ఏలియన్స్, టైటానిక్’ వంటి అద్భుత చిత్రాలను రూపొందించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ అవతార్ చిత్రానికి మరో నాలుగు సీక్వెల్స్ రాబోతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా జేమ్స్ కామెరూన్ ప్రకటించారు.

2009లో ‘అవతార్’ విడుదలై కలెక్షన్ల మోత మోగించి, కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్స్ గా మూడు భాగాలు తీస్తామని మొదట్లో జేమ్స్ కామెరూన్ ప్రకటించారు. కానీ తాజాగా మొత్తం నాలుగు భాగాలు సీక్వెల్స్ గా రూపొందించబోతున్నట్లుగా ఆయన తెలిపారు. 2018లో మొదటి భాగం, 2020లో రెండవ భాగం, 2022లో మూడవ భాగం, 2023లో నాలుగవ భాగాలను విడుదల చేయాలనుకుంటున్నట్లుగా జేమ్స్ కామెరూన్ స్పష్టం చేసారు.

ముందు మూడు భాగాలనే అనుకున్నప్పటికీ.. కానీ కథ పరిధి ఎక్కువ కావడం వల్ల నాలుగవ భాగం కూడా చేయాలనుకుంటున్నట్లుగా జేమ్స్ కామెరూన్ చెప్పుకొచ్చారు. ‘అవతార్’ విడుదలై దాదాపు ఏడేళ్లు గడుస్తోంది. గత ఏడేళ్లుగా జేమ్స్ కామెరూన్ మరియు అతని బృందం ఈ ‘అవతార్’ సీక్వెల్స్ ను మరింత అద్భుతంగా డిజైన్ చేసే పనిలో వున్నారు. ఇక ‘అవతార్’ పార్ట్ 2 చూడాలంటే మరో రెండేళ్లు వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Avatar  James Cameron  4 Parts  sequels  Release dates  

Other Articles