Bobby Simha | Reshmi Menon | Wedding Date | Reception

Bobby simha reshmi menon marriage on 22 april

Bobby Simha Reshmi Menon Wedding Date, Bobby Simha Reshmi Menon wedding news, Bobby Simha Reshmi Menon stills, Bobby Simha Reshmi Menon news, Bobby Simha Reshmi Menon love story, Bobby Simha Reshmi Menon

Bobby Simha Reshmi Menon Marriage on 22 April: Bobby Simha and Reshmi Menon will tie the knot April 22 in Tirupati. The event will be attended by the couple's close friends and family

ఈనెల 22న తిరుపతిలో బాబీసింహా-రెష్మీమీనన్ ల వివాహం

Posted: 04/16/2016 10:04 AM IST
Bobby simha reshmi menon marriage on 22 april

నేరం, జిగర్తండా, మసాలాపడం, బెంగళూర్ నాట్కల్ వంటి పలు చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపును దక్కించుకున్న నటుడు బాబీసింహ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాను ప్రేమించిన భామతో పెళ్లి చేసుకోబోతున్నాడు. తమిళ యువనటి రష్మీ మీనన్ తో బాబీసింహా గతకొద్ది కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. వీరి ప్రేమను అర్థం చేసుకున్న ఇరువురి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. దీంతో వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

ఇటీవలే వీరి నిశ్చితార్థం చెన్నైలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఈనెల 22న తిరుమలలో వీరి వివాహానికి ముహూర్తం ఖరారు చేసారు. అందువల్ల వీరివురూ కలిసి తమ పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మా పెళ్లికి రండి అంటూ బంధువులను, సన్నిహితులను, సినీ ప్రముఖులను ఆహ్వానించడంలో బిజీగా వున్నారు.

వీరి పెళ్లి ఈనెల 22న తిరుమలలో జరగనుంది. వివాహ రిసెప్షన్ 24న చెన్నైలోని, వడపళనిలో గల గ్రీన్‌పార్క్ హోటల్‌లో నిర్వహించనున్నట్లు తెలియజేసారు. ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. జిగర్‌తంగా చిత్రంలో ఉత్తమ నటనకు గాను జాతీయ అవార్డును అందుకున్న బాబీసింహా ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నారు.
.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bobby Simha  Reshmi Menon  Wedding  Stills  

Other Articles