Nani | Gentleman | First Look Poster | Mohanakrishna Indraganti | Surabhi

Nani gentleman first look poster released

Nani Gentleman Movie First Look, Nani Gentleman Poster, Nani Gentleman First Look, Nani Gentleman stills, Nani Gentleman movie updates, Nani Gentleman shooting completed, Nani Gentleman details, Nani Gentleman updates, Nani stills

Nani Gentleman First Look Poster Released: Tollywood actor Nani upcoming film title is Gentleman. This Movie First Look poster released on Sri Rama Navami special.

‘జెంటిల్ మన్’గా వస్తున్న నాని... ఫస్ట్ లుక్ విడుదల

Posted: 04/15/2016 12:13 PM IST
Nani gentleman first look poster released

‘ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ వంటి వరుస హ్యాట్రిక్ హిట్ చిత్రాల తర్వాత నాని హీరోగా ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘జెంటిల్ మన్’ అనే టైటిల్ ఖరారు చేసారు. తాజాగా శ్రీరామనవమి పండగ సంధర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

హీరోనా విలనా? అనే లైన్ ఈ పోస్టర్ పై కనిపిస్తుంది. అంటే సినిమాలో నాని పాత్ర ఎలా వుండబోతుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో మోహనకృష్ణ ఇంద్రగంటి, నానిల కాంబినేషన్లో ‘అష్టాచమ్మా’ అనే హిట్ చిత్రం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిదే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. నాని సరసన సురభి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, 'సత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Gentleman  First Look Poster  Surabhi  stills  

Other Articles