Manchu Vishnu | comments | Eedo Rakam Aado Rakam | Tollywood young actors

Manchu vishnu sensational comments on young actors

Manchu Vishnu comments on heros, Manchu Vishnu comments on actors, Eedo Rakam Aado Rakam reviews, Eedo Rakam Aado Rakam collections, Eedo Rakam Aado Rakam movie, Eedo Rakam Aado Rakam videos, Eedo Rakam Aado Rakam posters, Eedo Rakam Aado Rakam stills

Manchu Vishnu Sensational Comments on young actors: Manchu Vishnu, Raj Tarun latest film Eedo Rakam Aado Rakam. Sonarika, Hebah Patel heroines.

యంగ్ హీరోలపై మంచు విష్ణు కామెంట్లు

Posted: 04/15/2016 11:41 AM IST
Manchu vishnu sensational comments on young actors

మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా సోనారిక, హేభ పటేల్ హీరోయిన్లుగా నటించిన తాజా మల్టీస్టారర్ చిత్రం ‘ఈడోరకం ఆడోరకం’. ఈ చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మంచు విష్ణు పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. హిందీలో హీరోలు కలిసి మెలిసి నటిస్తారు. ఆర్థికంగా సినిమా స్థాయిని పెంచుతారు.

కానీ మనం మాత్రం బావిలో కప్పల్లా తయారయ్యాం అంటూ విష్ణు కామెంట్స్ చేసారు. అయితే తాను మాత్రం మల్టీస్టారర్ చిత్రంలో ఎవరితోనైనా చేయడానికైనా సిద్ధమేనని, తన పాత్ర నిడివి ఎంత తక్కువైన, చిన్నదైనా పర్వాలేదని.. మల్టీస్టారర్ చిత్రాలకు తానెప్పుడూ రెడీయే అంటూ విష్ణు చెప్పుకొచ్చారు. ఇతర సినిమాల్లో తనకు పాత్ర చిన్నదైనా చేయడానికి సిద్ధమేనని.. ఎలాంటి పాత్ర అయినా మెప్పించగలననే నమ్మకం తనకు వుందని.. ఇతర హీరోల్లో ఆ నమ్మకం లేదేమో అంటూ కామెంట్ చేసారు.

Eedo Rakam Aado Rakam Movie Review

‘ఈడోరకం ఆడోరకం’ సినిమాలో రాజ్ తరుణ్ పాత్ర కోసం చాలా మందిని సంప్రదించారట. కానీ ఎవరూ ఆసక్తి చూపించలేదట. అయితే ఆ సమయంలో ‘సినిమాచూపిస్త మావ’ సినిమాలోని రాజ్ తరుణ్ నటన చూసి.. తాను అనుకున్న పాత్రకు రాజ్ తరుణ్ అయితే బాగా సెట్ అవుతాడని అనిపించడంతో.. రాజ్ తరుణ్ కు కూడా కథ నచ్చి వెంటనే ఒకే చెప్పేసాడని విష్ణు చెప్పుకొచ్చాడు. మరి విష్ణు కామెంట్స్ పై ఎవరు ఎలా స్పందిస్తారో.. లేక విష్ణు మాటలను తేలికగా తీసుకుంటారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  Comments  Eedo Rakam Aado Rakam  Collections  Reviews  

Other Articles