Saidharam Tej | Supreme | Audio Launch | Songs Jukebox | Raashi Khanna | Trailer

Supreme audio launch

Supreme Music Launch, Supreme Trailer, Supreme Full Songs Jukebox, Supreme Pre Business in guntur, Supreme Pre Business details, Supreme movie teaser, Supreme movie stills, Supreme movie posters, Saidharam Tej latest stills, Saidharam Tej movies, Saidharam Tej

Supreme Audio Launch: Starring Sai Dharam Tej, Raashi Khanna, Music composed by Sai Kartheek, Directed by Anil Ravipudi and Produced by Dil Raju under the banner of Sri Venkateswara Creations.

అంజనాదేవి చేతుల మీదుగా ‘సుప్రీం’ ఆడియో విడుదల

Posted: 04/15/2016 09:11 AM IST
Supreme audio launch

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా, 'పటాస్' సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సుప్రీమ్’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో, యువ నిర్మాత శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైద‌రాబాద్ లోని శిల్పక‌ళావేదిక‌లో ఘనంగా జ‌రిగింది. సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు.

ఆడియో రివ్యూ... ‘సుప్రీం’ మాస్ మసాలా ఆల్బం

నాని, వ‌రుణ్ తేజ్ క‌లిసి థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. అంజ‌నాదేవి బిగ్ సీడీని విడుద‌ల చేశారు. అల్లు అర‌వింద్ ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. నాని, వ‌రుణ్ తేజ్ తొలి సీడీల‌ను అందుకున్నారు. ఈ సంధర్భంగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ..... అభిమానుల్లో ఒక‌డిగా ఉన్న నేను ఇవాళ ఇలా వ‌చ్చి మాట్లాడ‌టానికి కార‌ణ‌మైన మా ముగ్గురు మావ‌య్య‌ల‌కి పాదాభివంద‌నం. సుప్రీమ్ అనే టైటిల్ పెట్టుకోవ‌డానికి అర్హ‌త ఉండాలి. అందుకు విన‌గానే నాకు కంగారు వ‌చ్చింది. పెద్ద‌మావ‌య్య‌గారిద‌గ్గ‌రికి వెళ్లి ఈ విష‌యాన్ని చెప్తే ``నువ్వెందుకురా భ‌య‌ప‌డుతున్నాను. క‌ష్ట‌పడు`` అని అన్నారు. ర‌క్తం చిందించి అయినా స‌రే క‌ష్ట‌ప‌డి ముందుకు వెళ్లాలి అని డిసైడ్ అని అనుకున్నా. సుప్రీమ్ అనే పేరు పెట్టుకున్నందుకు చిరంజీవిగారి ప‌రువు నిల‌బెట్టాలి అని అనుకుని క‌ష్ట‌ప‌డ్డా. నిర్మాత రాజుగారితో ఇది నా మూడో సినిమా. నాకు ఎప్పుడైనా క‌థ న‌చ్చితే చెబితే ఎంక‌రేజ్ చేస్తుంటారు. శిరీష్ గారు ప్ర‌తి రోజూ సెట్‌కి వ‌చ్చి మ‌మ్మ‌ల్ని ఎంక‌రేజ్ చేశారు. ఎక్క‌డా ఖ‌ర్చుకు డోకా లేకుండా చేశారు. మా సినిమాలో అనిల్ గారి న‌వ్వు వినిపిస్తే షూటింగ్ క‌ట్ చేసే వాళ్లం. ఎన‌ర్జీ ఇచ్చాడు. నాలో 50 శాతం ఎనర్జీ ఉంటే దాన్ని 100 శాతం చేయించారు ఆయ‌న‌. నాలో నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకున్నారు. అనిల్ అన్న నాకు మంచి అవ‌కాశం ఇచ్చారు. సాయికార్తిక్‌గారి సంగీతం న‌చ్చింది. భ‌విష్య‌త్తులోనూ ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేస్తాను. కెమెరామేన్ రిస్కీ షాట్‌ల‌ను కూడా చాలా బాగా తీశారు. ర‌వికిష‌న్ వండ‌ర్‌ఫుల్ ప‌ర్స‌న్‌. రాజ‌స్థాన్‌లో చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ జ‌రిగిన 20 డేస్ త‌ర్వాత క‌లిసిన‌ప్పుడు చాలా ఎనర్జీతో మాట్లాడారు. అది స్ఫూర్తిగా అనిపించింది. రాశీ ల‌వ్లీ కోస్టార్‌. త‌న కామెడీ టైమింగ్ అద‌ర‌గొట్టింది. బుడ్డోడు చాలా బాగా చేశాడు. అభిమానుల్లో ఎప్పుడూ ఒక‌డిగా ఉండాల‌ని అనుకుంటాను అని చెప్పారు.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ..... ప‌టాస్ సినిమా విష‌యంలో పెద్ద కాన్ఫిడెంట్ లేదు. రెండో సినిమా మాత్రం చాలా ఫ్రీడ‌మ్ తో చేశారు. థియేట‌ర్‌లో 5 శాతం చూశారు. థియేట‌ర్లో చాలా అంశాలుంటాయి. ఫ్యామిలీస్‌కి, పిల్ల‌ల‌కు న‌చ్చే అంశాలు చాలా ఉంటాయి. సుప్రీమ్ సినిమా ద్వారా నేను గొప్ప విష‌యం నేర్చుకున్నాను. ఆర్టిస్ట్ అనే వారి క‌ష్టం, రిస్క్ ఏంటో నేను ప్ర‌త్య‌క్షంగా చేశాను. రాజ‌స్థాన్‌లో ఓ ఛేజ్ చేశాం. ర‌వికిష‌న్‌, ఓ చిన్న‌పిల్లాడు, సాయి, రాశీ అంద‌రూ చాలా బాగా చేశారు. ర‌వికిష‌న్‌గారు గాయ‌ప‌డి మ‌ర‌లా వ‌చ్చి షూట్ చేశాడు. ఇందులో న‌టించిన ప్ర‌తి ఆర్టిస్టుకి నా టీమ్ త‌ర‌ఫున విష‌స్ చెప్పుకుంటున్నాను. క‌థ ఓకే చేసిన‌ప్ప‌టి నుంచి రాజుగారు `నాకు డ‌బ్బులు వ‌చ్చే సినిమా తీయ్‌` అని చెప్పేవారు. ఈ సినిమా ఆద్యంతం శిరీష్‌గారు న‌న్ను ఎక్కువ‌గా న‌మ్మారు. ప్ర‌తిరోజూ మాతో ఉంటూ మ‌మ్మ‌ల్ని న‌డిపించారు. తేజ్ ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్ గా చేశాడు. ఆల్ రౌండ‌ర్‌గా చేశాడు. తేజ్ ఈ సినిమాతో దుమ్ములేపుతాడు. ఈ చిత్రంలో రాశి హీరోయిన్ కాదు. క‌మెడియ‌న్‌. ఇన్నొసెంట్‌గా, పోలీస్ ఆఫీస‌ర్‌గా చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. ర‌వికిష‌న్‌, క‌బీర్‌, పోసాని, వెన్నెల‌కిశోర్‌కి అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఇది టెక్నీషియ‌న్ల మూవీ. కెమెరామేన్ సాయిశ్రీరామ్‌, సంగీత ద‌ర్శ‌కుడు సాయికార్తిక్‌, ఫైట్స్ వెంక‌ట్ ఇలా ప్ర‌తి ఒక్క‌రూ చాలా బాగా చేశారు. సుప్రీమ్ స‌మ్మ‌ర్‌లో మీకు మంచి ఫీస్ట్ అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme  Sai Dharam Tej  Audio Launch  Trailer  Audio Jukebox  Raashi khanna  Stills  

Other Articles

Today on Telugu Wishesh