Aishwarya Rai Bachchan wins Global Indian of the Year award

Aishwarya rai wins global indian of the year award

aishwarya rai bachchan, global indian of the year award, aishwarya rai bachchan news, aishwarya rai bachchan gets global indian of the year award, aishwarya rai bachchan latest news, entertainment news

Actress Aishwarya Rai Bachchan has won the ‘Global Indian of the Year’ award. she was honoured at NRI of the Year award function

ఐశ్వర్యను వరించిన గ్లోబల్ ఇండియన్ అవార్డు

Posted: 04/12/2016 05:24 PM IST
Aishwarya rai wins global indian of the year award

బాలీవుడ్ నాటి నేటి అందాల తార నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ అందుకున్న అనేక అవార్డుల జాబితాలోకి మరో అవార్డు కూడా వచ్చి చేరింది. గత కొంతకాలంగా సినీమాలకు దూరంగా వున్న ఐశ్వర్యరాయ్ కి ‘గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. ఎన్ ఆర్ ఐ అకాడమీ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐష్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఐష్ మాట్లాడుతూ.. తాను ఇష్టంతో సినిమా రంగంలోకి వచ్చాననీ, ఇక్కడ  అనేక అవకాశాలు తనకు లభించాయని తెలిపారు.

సామాజికంగా అనేక కార్యక్రమాలు చేయడానికి సినిమా రంగం తనకు అవకాశం కల్పించిదని అన్నారు. ఈ అవార్డుతో అంతర్జాతీయ స్థాయిలో మహిళలకు ప్రతినిధిగా నిలబడతానని చెప్పారు. ఈ అవార్డును తన కూతురు ఆరాధ్యకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు. ఐశ్వర్యతో పాటు 17 మంది వివిధ రంగాల్లోని ప్రముఖ మహిళలకు సైతం అవార్డులు లభించాయి. ఈ అవార్డుల కార్యక్రమానికి ఐశ్వరరాయ్ మామగారు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా హజరయ్యారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya  win  Global Indian of the Year award  

Other Articles