Pawan kalyan | Sardaar Gabbar Singh | interview | collections | Trailers

Pawan kalyan sardaar gabbar singh interview

Pawan kalyan interview, Pawan kalyan talks about sardaar, Pawan kalyan latest interviews, Pawan kalyan sardaar interview, Pawan kalyan Sardaar Gabbar Singh Interviews, Sardaar Gabbar Singh interviews, Sardaar Gabbar Singh collections, Sardaar Gabbar Singh stills

Pawan kalyan Sardaar Gabbar Singh interview: Powerstar Pawan kalyan latest hit Sardaar Gabbar Singh. Pawan kalyan latest interviews, stills, photos, gallery.

తనతో సినిమాలు చేయడానికి దర్శకులు లేరట

Posted: 04/11/2016 11:01 AM IST
Pawan kalyan sardaar gabbar singh interview

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎల్లలు లేని స్టార్ డం ఆయన సొంతం. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులో వున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం ఈ ఉగాది కానుకగా విడుదలై కలెక్షన్ల మోత మోగిస్తోంది.

ఈ సంధర్భంగా పలు మీడియా ఛానెల్లతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ తన సినిమా, రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

పోరాటం చేయడానికి, ప్రయోగాలు చేయడానికి వెనుకాడను.. దెబ్బతింటానని తెలుసు.. ఈ స్థాయికి రావడానికి నేను ఎన్ని రకాల భయాలను దాటుంటానో నాకు తెలుసు.
నా స్థాయి ఇంతే అని చెప్పడానికి నువ్వేవరివి? అనుకున్న దానికి ఎవరూ రాలేరు. నా స్థాయి ఎంటో చెప్పడానికి నువ్వేవరివి?
నేను ప్రతిసారి గెలవకపోవచ్చు.. గెలుస్తానని చెప్పను. కానీ ఎవరో నన్ను క్రిటిసైస్ చేస్తే వాటిని నేను పట్టించుకోను. బాధపడను.
నెల గడవడమే కష్టంగా ఉందని ,ఇక నా స్టాఫ్ జీతాలు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పుకొచ్చాడు.

ప్రతి సినిమాకు అంచనాలు పెరిగిపోవడం వల్ల నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ‘ఖుషి’ విడుదలయ్యాక చాలా డిప్రెషన్ ఏర్పడింది. ఈ సినిమా విడుదలయ్యాక అంత అంచనాలు పెరగడంతో చాలా డిప్రెషన్ వచ్చేసింది. ఇక ‘అత్తారింటికి దారేది’ తర్వాత నాతో చేయడానికి ఎవరూ రాలేదు. ప్రతిసారి నా నుంచి అభిమానులు భారీ స్థాయిలో ఆశిస్తుంటారు. డబ్బులున్నాయి, పేరుంది.. కానీ ఆ అంచనాలు అందుకునే భాధ్యతలు తీసుకునే వ్యక్తులు లేరు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ చెప్పిన మరిన్ని విశేషాలు ఏంటో మీరే వినండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Interview  Sardaar Gabbar Singh  Collections  stills  

Other Articles