Venkatesh | Babu Bangaram | First Look Date | Nayanthara | Maruthi

Babu bangaram first look poster

Babu Bangaram First Look, Babu Bangaram movie updates, Venkatesh movies, Venkatesh babu bangaram movie updates, Venkatesh Nayanthara movie updates, Venkatesh maruthi movie updates, Venkatesh stills

Babu Bangaram First Look Poster: Victory Venkatesh upcoming film Babu Bangaram. Director Maruthi. Nayanthara heroine. gibran music. This film first look poster released.

‘బాబు బంగారం’ ఫస్ట్ లుక్ అదిరింది

Posted: 04/08/2016 11:58 AM IST
Babu bangaram first look poster

‘దృశ్యం’, ‘గోపాల గోపాల’ చిత్రాల తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బాబు బంగారం’. ప్రముఖ యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) స‌మ‌ర్పణ‌లో సితార ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్ పై సూర్యదేవ‌ర నాగ వంశీ, పిడివి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఉగాది పండగ సంధర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో వెంకటేష్ లుక్ చాలా బాగుంది. యంగ్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమా వెంకటేష్ సరసన మరోసారి నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘లక్ష్మీ’, ‘తులసి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలొచ్చాయి.

ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని వేసవి సెలవుల కానుకగా జులై నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, పృధ్వి, మురళీశర్మ, దేవ్ గిల్, జయప్రకాష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: SB.ఉద్దవ్, కళ: రమణ వంక, చాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్, సంగీతం: జిబ్రాన్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్, రచన-దర్శకత్వం: మారుతి.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Babu Bangaram  First look  Nayanthara  Maruthi  

Other Articles