పవర్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల మొదటి రోజు, మొదటి ఆటకు చూస్తే ఆ కిక్కే వేరబ్బా... అలాంటి కిక్కు కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఆరాటపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం ఏప్రిల్ 8న గ్రాండ్ గా విడుదల కానుంది. విదేశాల్లో ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇక స్టార్ హీరోల సినిమాలకు బెన్ఫిట్ షోల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కానీ పవర్ స్టార్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అధిక సంఖ్యలో బెన్ఫిట్ షోలను ఏర్పాటు చేసారు. అభిమానులు ఈ బెన్ఫిట్ షో టికెట్ల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ టికెట్ ఒక్కొక్కటి 2వేల రూపాయల నుంచి రేటు పలుకుతోంది. ఈ టికెట్లను సొంతం చేసుకోవడానికి అభిమానులు ఎంత ఖర్చు అయినా పెట్టడానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ప్రదర్శించబడే థియేటర్లలో టికెట్ల కొరత ఏర్పడింది. మాములు జనాలు కొనేంత రేటుకు టికెట్లు దొరకడం లేదు. థియేటర యాజమాన్యం టికెట్లను బ్లాక్ లో అమ్మేసుకొని సంబరపడిపోతున్నారు. అయినా కూడా అభిమానులు బ్లాక్ లోనైనా టికెట్ ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక్కమాట... బెన్ఫిట్ షోలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టాక్ పాజిటివ్ గా వస్తే.... ఈ సినిమా కలెక్షన్ల రికార్డులను ఎవరూ ఆపలేరనేది సినీవర్గాల అభిప్రాయం.
- Sandy
(And get your daily news straight to your inbox)
May 26 | చిత్రరంగంపై మక్కువతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివచ్చి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి సినిమాలు.. అనుకున్నది అనుకున్నట్టుగా రూపోందించి సత్తాను చాటుకున్నారు. ఈ క్రమంలో కామెడీ సీక్వెల్ చిత్రాను తెరకెక్కించేందుకు ఆయన తన ప్రాధాన్యతను చూపుతున్నారు.... Read more
May 26 | తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం. రామకృష్ణారెడ్డి క్రితంరోజు రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1948 మార్చి... Read more
May 25 | నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఇండియాలోను .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన... Read more
May 21 | యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. మే6న విడుదలైన ... Read more
May 21 | తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయినందకు వారికి క్షమాపణలు చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని..క్షమించాలని కోరారు. ఈ మేరకు తాజాగా... Read more