Renu Desai | Surprise | Sardaar Gabbar Singh | Pawan Kalyan | Akhira

Akhira birthday gift from sardaar gabbar singh

Renu Desai Surprise to Sardaar Fans, Renu Desai Surprise to Pawan kalyan Fans, Sardaar release on Akhira birthday, Akhira birthday gift from pawan kalyan, akhira birthday special gift, Sardaar Gabbar Singh Review, Sardaar Gabbar Singh talk, Sardaar Gabbar Singh public talk, Sardaar Gabbar Singh theaters list, Sardaar Gabbar Singh trailers, Sardaar Gabbar Singh posters, Sardaar Gabbar Singh stills, Sardaar Gabbar Singh shows, Sardaar Gabbar Singh updates, Sardaar Gabbar Singh, Pawan kalyan, Kajal

Akhira birthday gift from Sardaar Gabbar Singh: Pawan Kalyan, Renu Desai`s son Akhira birthday on april 8. Renu desai reveal this special surprise.

అకీరాకు పవర్ స్టార్ సర్దార్ స్పెషల్ గిఫ్ట్

Posted: 04/07/2016 01:09 PM IST
Akhira birthday gift from sardaar gabbar singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెండవ భార్య రేణు దేశాయ్ నుంచి విడిపోయి, అన్నా లెజినెవాను మూడవ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ పవన్-రేణుల సంతానం అకీరా, ఆధ్యల బాగోగుల విషయంలో పవన్ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు. రేణుతో విడిపోయినప్పటికీ అకీరా, ఆధ్యలకు మాత్రం తండ్రిగా పవన్ ఎప్పుడు అందుబాటులో వుంటుంటాడు.

అలాంటి పవర్ స్టార్ తన కొడుకు అకీరా పుట్టినరోజు వేడుకను ప్రపంచ వ్యాప్తంగా సంతోషంగా జరుపుకునేలా ప్లాన్ చేసాడు. కానీ ఆ ప్లాన్ యాదృచ్చికంగా జరిగిందనే చెప్పుకోవాలి. తెలుగువారి తొలి సంవత్సరం ఉగాదితోనే ప్రారంభం అవుతుంది. అలాంటి ఉగాది రోజున పవన్ కళ్యాణ్ తాను నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

ఒకే రోజున రెండు పండగలు అని భావించిన పవన్ ఫ్యాన్స్ కు రేణుదేశాయ్ మరో కొత్త వార్తను ప్రకటించింది. ‘‘ఏప్రిల్ 8న ఉగాది పండగ మరియు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం విడుదలతో పాటు అకీరా పుట్టినరోజు కూడా... హ్యాపీ బర్త్ డే అకీరా’’ అంటూ రేణుదేశాయ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలిసిన అభిమానుల సందడి మరింత ఎక్కువయ్యింది.

మరి పవన్ కళ్యాణ్ కావాలనే అకీరా పుట్టినరోజు కానుకగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నాడో లేక ఉగాది కానుకగా అభిమానుల కోసం విడుదల చేస్తున్నాడో తెలియదు కానీ మొత్తానికి అనుకోని సంబరం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్లో మరొకటి చేరిందని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్టయ్యితే ఆ కిక్కే వేరబ్బా.

- Sandy.N

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbar Singh  Pawan kalyan  Renu Desai  Akhira Birthday  Gift  stills  

Other Articles