Allu Arjun | Sarainodu | Audio Songs | Rakul preet singh

Sarrainodu music review

Sarrainodu Audio Review, Allu Arjun Sarainodu Songs, Sarainodu Pre Look Poster, Allu Arjun Sarainodu movie stills, Allu Arjun latest news, Allu Arjun movie updates, Allu Arjun movie details, Allu Arjun

Sarrainodu Music Review: Stylish star allu arjun Sarainodu film songs released. boyapati srinu director, Rakul preet singh heroine. Thaman Music.

విడుదలైన ‘సరైనోడు’ పాటలు.. ఆడియో రివ్యూ

Posted: 04/01/2016 10:56 AM IST
Sarrainodu music review

‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’ చిత్రాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరైనోడు’. ప్రముఖ కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బన్నీ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. హీరోయిన్ అంజలి ‘బ్లాక్ బస్టర్’ అనే స్పెషల్ లో నటించింది. థమన్ సంగీతం అందించిన పాటలు నేడు లహరి మ్యూజిక్ ద్వారా నేరుగా మార్కెట్లోకి విడుదల చేసారు. ఆ పాటలు ఎలా వున్నాయో మీకోసం అందిస్తున్నాం.. మీరు ఓ లుక్కేయండి.

1. బ్లాకు బస్టరే...
శ్రేయ ఘోషల్, నకష్ అజిజ్, సింహ, శ్రీకృష్ణ, దీపు కలిసి పాడారు. ఈ పాట ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మాస్ మసాలా సాంగ్ గా రూపొందిన ఈ పాట అదిరిపోయింది. థమన్ తనదైన శైలిలో డప్పుల బ్యాగ్రౌండ్ స్కోర్ తో, మెలోడి బిజీయంతో కొత్తగా ట్రై చేసాడు. ఈపాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.

2. అతిలోక సుందరి...
ఈ పాటను విశాల్ దద్లానీ, కార్తీక్ పాడారు. రామజోగయ్య శాస్త్రి పాడారు. ఈ పాట వినడానికి అంతగా క్యాచీగా లేదు. పైగా ఇందులోని వాయిస్ అల్లు అర్జున్ కు సెట్ అవ్వలేనట్లుగా అనిపిస్తుంది. హీరోయిన్ ను చూసిన తొలిచూపులోనే ప్రేమలో పడిపోయిన హీరో... తన ప్రియురాలిని ఉద్దేశించి పాడే సంధర్భం. ఈ పాటను కూడా థమన్ తన డప్పుల మోతతోనే రూపొందించేసాడు.

3. యు ఆర్ మై ఎమ్మేల్యే...
ఈ పాటను ధనుంజయ్ పాడారు. అనంత శ్రీరామ్ సాహిత్యం బాగుంది. ఈ పాటలోని పదాలన్ని కూడా జనాలు ప్రతిరోజు మాట్లాడుకునే మాటలే. అందుకే సాహిత్యం పరంగా చాలా చక్కగా వుంది. ఇక ట్యూన్ పరంగా చాలా బాగుంది. వెస్ట్రన్ బీట్ కు కాస్త ఫోక్ జోనర్ తో థమన్ సెట్ చేసినట్లుగా అనిపిస్తుంది. పాటలో కాస్త పల్లెటూరి వాతావరణం వున్నట్లుగా అనిపిస్తూ వుంటుంది. బీజియం మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది.

4. ప్రైవేట్ పార్టీ....
ఈ పాటను యం.సి. విక్కీ, మానసి ఎం.ఎం. పాడారు. కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. ఈ పాట పూర్తిస్థాయి వెస్ట్రన్ స్టైల్లో కొనసాగుతుంది. డిజె తరహాలో ప్రైవేట్ పార్టీ అంటూ కొత్తగా ట్రై చేయాలని థమన్ ప్రయత్నించినట్లుగా అనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా డిజె, ప్రైవేట్ పార్టీల్లో ఎంజాయ్ చేసే విధంగా ఈపాటలో జోష్ లేదు. పైగా పాటలో బిజీయం కూడా అంతగా ఆకట్టుకోలేదు.

5. తెలుసా తెలుసా...
ఈ పాటను జుబిన్ నౌటియల్, సమ్మీరా భరద్వాజ కలిసి పాడారు. శ్రీమణి అందించిన లిరిక్స్ బాగున్నాయి. పూర్తిస్థాయి క్లాసీ మెలోడిగా రూపొందింది. లవ్ లో వున్నవారికి, ప్రేమంటే ఇష్టపడేవారికి ఈ పాట వెంటనే కిక్కెక్కిస్తోంది. ముఖ్యంగా అమ్మాయి లిరిక్స్ చాలా బాగున్నాయి. మొత్తానికి ఈ పాట అదిరిపోయింది

6. సరైనోడు....
ఈ పాటను హర్డ్ కౌర్, బ్రిజేష్ షాడిల్యా, సోను కక్కార్ పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఈ పాటను ఫుల్ బ్యాగ్రౌండ్ సెట్లో చిత్రీకరించేందుకు డిజైన్ చేసినట్లుగా అనిపిస్తోంది. హీరోహీరోయిన్లు మంచి జోష్ లో వుండి ఎంజాయ్ చేసే సమయంలో, ప్రీ క్లైమాక్స్ సమయంలో ఈ పాట వస్తుందనే విధంగా వుంది. పాట స్టార్టింగ్ మాంచి బీట్ సౌండ్ తో ప్రారంభమైనప్పటికీ.. టైటిల్ సాంగ్ కు తగిన న్యాయం చేయటనట్లుగా అనిపిస్తుంది. కానీ మొత్తానికి ఏదో హడావిడి చేసే విధంగా వుంది. ఈ పాటలో బన్నీ తన డాన్సులతో ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది.

మొత్తానికి థమన్ మళ్లీ తన అర్థంపర్థంలేని డప్పు మోతను మాత్రం ఎక్కడా విడిచిపెట్టలేనట్లుగా కనిపిస్తుంది. మరి ఆడియో పరంగా పర్వాలేదనిపించిన ‘సరైనోడు’ విజువల్స్ పరంగా ఈ పాటలతో ఎలా అలరించనున్నాడో చూడాలి. ఏప్రిల్ రెండో వారంలో విశాఖపట్నంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేయనున్నారు. ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Allu Arjun  Sarainodu  Audio review  Songs  Rakul preet singh  

Other Articles