Pawan Kalyan | Sardaar Gabbar Singh | Hindi Audio Jukebox | Trailer

Sardaar gabbar singh hindi audio jukebox

Sardaar Gabbarsingh Hindi Audio Songs, Sardaar Gabbarsingh Trailers, Sardaar Gabbar Singh shooting stills, Sardaar Gabbar Singh overseas rights sold out, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Sardaar Gabbar Singh Hindi Audio Jukebox: Power star pawan kalyan Sardaar Gabbar singh Hindi Audio Jukebox. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ హిందీ పాటలు విడుదల

Posted: 03/31/2016 03:58 PM IST
Sardaar gabbar singh hindi audio jukebox

‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు తెలుగులో ఇప్పటికే విడుదలై దుమ్మురేపుతున్నాయి. టాప్ 10లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పాటలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా హిందీ వర్షెన్ కు సంబంధించిన పాటలను విడుదల చేసారు. ఈ పాటలు కూడా వినడానికి చాలా బాగున్నాయి. ఎక్కడా కూడా ఒరిజనల్ వర్షెన్ కు తక్కువ కాకుండా లిరిక్స్ పరంగా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. కానీ ‘తోబ తోబ..’ పాటలో కాస్త మార్పులు చేసారు.

ఇక ఇప్పటికే విడుదలైన హిందీ ట్రైలర్ సైతం అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాయ్ లక్ష్మీ, సంజనలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డుల మోత మోగించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan Kalyan  Sardaar Gabbar Singh  Hindi Audio jukebox  Trailers  

Other Articles