Pawan Kalyan | Sardaar Gabbar Singh | Censor Report | Trailer

Sardaar gabbar singh censor report

Sardaar Gabbar Singh Censor Report, Sardaar Gabbarsingh Hindi Audio Songs, Sardaar Gabbarsingh Trailers, Sardaar Gabbar Singh shooting stills, Sardaar Gabbar Singh overseas rights sold out, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Sardaar Gabbar Singh Censor Report: Power star pawan kalyan Sardaar Gabbar singh Hindi Audio Jukebox. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

ఎలాంటి కట్స్ లేకుండా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెన్సార్ పూర్తి

Posted: 03/31/2016 04:33 PM IST
Sardaar gabbar singh censor report

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం దగ్గరికొచ్చేసింది. మరికొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సందడి చేయనున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఏప్రిల్ 8వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.

ఈ చిత్రానికి సెన్సార్ వారు ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ ను అందజేసినట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. పవర్ ఫుల్, హై వోల్టేజ్ యాక్షన్, ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు ఛార్ట్ బస్టర్స్ లో టాప్ 10 స్థానంలో నిలిచాయి. ఇక ట్రైలర్లకు కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీ క్రేజ్ వచ్చేసింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రాక కోసం బాలీవుడ్ జనాలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. రాయ్ లక్ష్మీ, సంజనలు కీలక పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటుడు శరత్ కేల్కర్ విలన్ పాత్రలో నటించాడు. మరి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఎలాంటి రికార్డుల మోత మోగించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan Kalyan  Sardaar Gabbar Singh  Censor Report  Trailers  

Other Articles